Law and order under control of governor narasimhan in ghmc

Governor ESL Narasimhan, , Special Power, GHMC, Law and Order, Internal Security, Common Capital

law and order under control of governor narasimhan in ghmc: Andhra Pradesh E S L Narasimhan to gain control over law and order, internal se. ... under Greater Hyderabad Municipal Corporation (GHMC) limits

పిల్లి చేతిలో ‘పవర్’ కీ పెట్టిన మోడీ !

Posted: 08/09/2014 09:13 AM IST
Law and order under control of governor narasimhan in ghmc

అవును.. నిజమే.. పిల్లి చేతిలో పవర్ కీ పెట్టిన మోడీ..!! రెండు రాష్ట్రాల మద్య పెదన్నగా ఉండని మన భక్త కన్నప్ప అయిన.. గవర్నర్ నరసింహన్ కు ఇవ్వటం జరిగింది.ఇప్పుడు ‘‘గవర్నర్ నరసింహన్ గోడ పిల్లి పాత్ర పోషించాలి’’ అయితే అందుకు .. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. ఛీ కొట్టారు. మాకు ‘‘ ఆంధ్ర వాసనే వద్దు అంటే.. మళ్లీ మాకు తమిళ ఇడ్లీ, సాంబార్ కంపు ’’ మాకొద్దు.. మా బతుకులు మేం బతుకుతాం.! మా పవర్ మాకే గావాలే!! అని కేసిఆర్ ఆయన ఫామ్ హౌస్ ..ఫైర్ అవుతున్నారు.

అయితే మన ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం .. రెండు రాష్ట్రాలకు.. ఆయనే గవర్నర్ అంటూ.. ఒక లేఖ పంపించటం జరిగింది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో శాంతిభద్రతలపై సర్వాధికారాలను కేంద్రప్రభుత్వం గవర్నరుకు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం... గ్రేటర్ హైదరాబాదు పరిధిలో శాంతిభద్రతల విషయంలో గవర్నరుకు ప్రత్యేక అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టు హైదరాబాదులో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత గవర్నరుకే ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, గవర్నర్ ముఖ్య కార్యదర్శి రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. అయితే, ఈ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఈ ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ సీఎస్ కేంద్రానికి తిరుగు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉండే శాంతిభద్రతలను కేంద్రం గవర్నరుకు అప్పగించడం ద్వారా పరోక్షంగా తాను పెత్తనం చేయాలని చూస్తోందన్నారు.

అయితే ఆంధ్రనేతలు మాత్రం.. సైలెంట్ గా.. బిత్తరు చూపులు చూస్తూ.. చంద్రబాబు తో.. గవర్నర్ పవర్ గురించి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఇప్పుడు తెలంగాణ వర్సెస్.. కేంద్రం.. ఇద్దరిలో పై చెయ్యి ఎవరిదో కొద్ది రోజుల్లో తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles