Pakistan hands over captured bsf jawan satyasheel yadav to india

BSF jawan Satyasheel Yadav, Pakistan hands over captured BSF jawan, BSF jawan Satyasheel Yadav to India, BSF jawan Satyasheel Yadav to India

Pakistan hands over captured BSF jawan Satyasheel Yadav to India: Pakistan on Friday handed over a captured BSF jawan to India at a border ... Hours before his release, Yadav had addressed a press conference in Sialkot in Pakistan saying that he ... Grateful to Pak for treating our jawan well

అది అసలు పాకిస్థాన్ కాదట..!

Posted: 08/09/2014 08:46 AM IST
Pakistan hands over captured bsf jawan satyasheel yadav to india

అది అసలు పాకిస్థాన్ కాదు..! అంటే అప్పటి పాకిస్థాన్ కాదు.. మోడీ వచ్చిన తరువాత పాకిస్థాన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు అలాంటి పాకిస్థాన్ ను నేను చూడలేదని భారతీయ జవాన్ సత్యశీల్ యాదవ్ చెబుతున్నారు. పాకిస్థాన్ కాస్త ..ప్రేమ దేశంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మోడీ రాకతో.. శత్రువు దేశం కాస్త.. స్నేహ దేశంగా మారిపోయిందని పాకిస్థాన్ సైన్యం చేతిలో చిక్కిన మన ఆర్మీ జవాన్ చెబుతున్నారు.

మన జవాన్ల తలలు నరికి తీసుకెళ్లిన పాకిస్థాన్.. ఇప్పుడు మన ముందు తల వంచింది. శత్రువు దేశం జవాన్ దొరికితే.. పాకిస్థాన్ సైన్యం ఏం చేస్తుందో ప్రపంచ దేశాలకు, భారతీయులకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు పాకిస్థాన్ పూర్తిగా మారిపోయింది. అందుకు నేనే సాక్షి అంటూ.. స్వదేశానికి చేరుకున్న భారత్ జవాన్ సత్యశీల్ యాదవ్ చెప్పటం జరిగింది.

పాకిస్థాన్ దేశం తనపై చూపిన ప్రేమకు ముగ్ధుడయ్యాడు. తనను ఆ దేశ అధికారులు చాలా బాగా చూసుకున్నారని స్పష్టం చేశాడు. ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్ ను ఆ దేశం సురక్షితంగా అప్పగించిన అనంతరం కుటుంబ సభ్యులను కలిసిన సత్యశీల్ మాట్లాడాడు. ' నన్ను పాకిస్తాన్ బాగా చూసుకుంది. నేను అనుకున్నదానికంటే ఎక్కువగా ఆ దేశం నాపట్ల అమితమైన శ్రద్ధ చూపించింది' అని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం బీఎస్ ఎఫ్ జవాన్ యాదవ్ చీనాబ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కాడు.

జమ్మూలోని ఆర్ ఎస్ పురా సెక్టార్ లోని జీరో లైన్ వద్ద పాక్ సైనికాధికారులు సత్యశీల్ ను ఈ రోజు బీఎస్ ఎఫ్ అధికారులకు అప్పగించారు. సత్యశీల్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని బీఎస్ ఎఫ్ అధికారి చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles