Rtc bus passes to andhra students

Andhra students Bus passes in Telangana, Andhra students passes under consideration, Telangana Transport Minsiter on bus passes

RTC Bus passes to Andhra students

ఆంధ్ర్రా విద్యార్థులకు బస్ పాస్ లుంటాయా?

Posted: 07/20/2014 09:58 AM IST
Rtc bus passes to andhra students

విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్ విషయంలో ఇంకా తర్జనభర్జనలు జరుగుతూనేవున్నాయి, ఈ లోపులో ఆంధ్రా విద్యార్థులకు బస్ పాస్ లు ఇవ్వాలా వద్దా అన్న అంశమొకటి తలెత్తింది.

ఆర్ టి సి బస్సులలో ఆంధ్రా విద్యార్థులకు బస్ పాస్ లు ఇవ్వాలా వద్దా అన్న విషయం మీద పరిశీలన జరుగుతోందని తెలంగాణా రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు.  ఈ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని కూడా ఆయన తెలియజేసారు.  

తెలంగాణాలో పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా తిరుగుతున్నవి ఆంధ్రా బస్సులేనని, వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తామని కూడా రవాణా మంత్రి అనటం విశేషం.
నిబంధనలను పాటించని ఆంధ్రా ప్రైవేట్ బస్ ఆపరేటర్ల మీద కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని రవాణా శాఖా మంత్రి హెచ్చరించారు.  ప్రత్యేకంగా ఆంధ్రా బస్సు ఆపరేటర్లు నియమాలను ఉల్లంఘిస్తే... అన్న దాన్ని రవాణా శాఖ హెచ్చరికల్లా కాకుండా రాజకీయ వివక్షాత్మకమైన హెచ్చరికల్లా తీసుకుంటున్నారు ఆంధ్రా నాయకులు.  

విద్యా, రవాణా, నదీ జలాల వివాదాలు తలలెత్తాయి.  పోలీసింగ్ మేమే చేసుకుంటామని చెప్పారు. హై కోర్టు లో న్యాయవాదుల మధ్య విభజన ఎప్పుడో వచ్చేసింది.  సినిమారంగంలోనూ విభజన జరిగిపోయింది. ఇక వైద్యరంగంలోను, వ్యాపార రంగంలోను కూడా వివక్ష రావటం మిగిలివుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ నాయకులు.   

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles