Ap assembly suggested to be changed to some other place

AP Assembly place to be changed, Joint Assembly posing problems, AP Telangana joint Assembly congested

AP Assembly suggested to be changed to some other place

ఎపి శాసనసభ తరలింపుకు సూచన

Posted: 07/20/2014 09:03 AM IST
Ap assembly suggested to be changed to some other place

ఆంధ్రప్రదేశ్ శాసనసభను మరో స్థానానికి మారిస్తేనే మంచిదని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.  ఆ మాటను ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్తున్నారు, తెలంగాణా నాయకులు చెప్పటంలేదంతే.  ఆ మాట తెలంగాణా అధికారపక్ష నాయకులు అంటే వివాదాలకు తావిచ్చినట్లవుతుంది.  ఎలాగూ శాసనసభా భవనం మనదే వెళ్ళవలసినవాళ్ళం మనం కాదు కదా అని ఓపిక పడుతున్నారు.  శాసన సభలో ఇరు రాష్ట్రాలకు చోటివ్వటంతో ఇబ్బందులనేవి ఇరు రాష్ట్ర నాయకులకూ ఉంది.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఉపసభాపతులకు ఒకే గదిని కేటాయించటం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ విపక్ష నేతకు సరైన గదివ్వలేకపోయారు.  ఇరు రాష్ట్రాల కార్యదర్శులు వారికి తోచినట్లుగా గదులను కేటాయించుకుంటూ పోయారు కానీ పరస్పరం సంప్రదింపులు చేసుకోవటం, సమన్వయంతో పనిచేయటమనేది లేదు.  

ఈ నేపథ్యంలో, శాసనసభను మరో చోటికి మారిస్తేనే బావుంటుందని భారతీయ జనతాపార్టీ తెలంగాణా శాసనసభపక్షనేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.  ఆయన ఈ విషయంలో గవర్నర్ కి విజ్ఞప్తిని కూడా పంపించారు.

నివాసాల విషయం చూసుకున్నా పరిస్థితి అలాగే వుంది.  మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఇంకా ఖాళీ చెయ్యలేదు.  25 మంది ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయించలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles