Former minister warns chandrababu of focusing on vijayawada guntur

focussing on vijayawada guntur area, ex minister sailajanath on vijayawada guntur concentration, development shouldn’t concentrate at guntur warns sailajanath

Former Minister Sailajanath warns Chandrababu of focusing on Vijayawada Guntur neglecting Ananthapur

హైద్రాబాద్ లో చేసిన తప్పు మళ్ళీ చెయ్యవద్దు

Posted: 07/16/2014 01:41 PM IST
Former minister warns chandrababu of focusing on vijayawada guntur

అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్ ల విషయానికి వచ్చేటప్పటికి వార్తలలో ఎక్కువగా విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా వినిపిస్తున్నాయని, అటువంటి ప్రచారం లో నిజముండి ఆ ప్రాంతానికే ప్రాధాన్యతనిస్తున్నట్లయితే అలా చెయ్యటం తగదని మాజీ మంత్రి శైలజానాథ్ అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చెయ్యరా అని ఆయన అడుగుతున్నారు.  అనంతపురం ఆంధ్ర ప్రదేశ్ కి రాజధానిగా చెయ్యాలని, కనీసం రెండవ రాజధానిగానైనా చెయ్యాలని, అనంతపురం జిల్లా ఐటి హబ్ గా చెయ్యాలని కోరుతున్నానని శైలజానాథ్ అన్నారు.

వినదగునెవ్వరు చెప్పిన అని, ఆయన మాజీ మంత్రైనా, వేరే పార్టీకి చెందినా, కేవలం ఒక జిల్లా గురించే మాట్లాడుతున్నా, ఆయన చెప్పిన మాటల మీద కూడా కాస్త ఆలోచన పెట్టవలసిందే.  

మన రాజధాని అంటూ హైద్రాబాద్ నే అభివృద్ధిని చేసి చివరకు దాన్ని వదిలిపెట్టేసాం కదా, రాష్ట్రంలో ఇంకా కొన్ని నగరాలను కూడా హైద్రాబాద్ కి దీటుగా అభివృద్ధి చేసివుండవలసింది అన్నది సీమాంధ్రుల ప్రధానమైన వేదనాభరితమైన వాదన.  మరోసారి అలాంటి తప్పు చేస్తూ ఒక్క విజయవాడ గుంటూరు ప్రాంతాల మీదనే దృష్టంతా కేంద్రీకరించటం సరికాదన్న విషయం శైలజానాథ్ చెప్పినా వేరెవరు చెప్పినా దాని గురించి ఆలోచించవలసిన విషయమే కదా.  ఈ విషయం తెలిసి కూడా ఉండవచ్చు, అదే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉండవచ్చునేమో కానీ సకాలంలో ఇచ్చే సూచనలకు విలువుంటుందన్నది మర్చిపోగూడదు.  

రాజధాని విజయవాడ గుంటూరు ప్రాంతాలలోనే స్థాపించాలనే నిర్ణయం జరగాలన్న పట్టుదల కూడా నిజానికి అటువంటి ఆలోచనలో పుట్టినదే.  మద్రాసు పోగొట్టుకున్నాం, ఇప్పుడు హైద్రాబాద్ పోగొట్టుకున్నాం, మరోసారి విభజన జరిగి సీమ ప్రాంతం విడిపోతే... అన్న ఆలోచనే రాజధాని స్థాపన ఆంధ్రా నడిబొడ్డులో జరగాలనటానికి మూలం.  

ఏమైనా హైద్రాబాద్ విషయంలో చేసిన తప్పు మాత్రం పునరావృతం కాకూడదన్నది అందరి ఆలోచన కూడా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles