Modi strengthens his group

modi strengthens his group, trai amendment passed, modi gives power to defeated mps

Modi strengthens his group by taking his own men into it

వడ్డించేవాడు మనవాడైతే... అన్నది మోదీ విషయంలో

Posted: 07/16/2014 01:11 PM IST
Modi strengthens his group

వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్న లోకోక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విషయంలో సరిగ్గా సరిపోతోంది.

బహిరంగంగా పాదాభివందంనం చేసినా, అధికార వితరణకు వచ్చేటప్పటికి అద్వానీని దూరంగా ఉంచిన నరేంద్ర మోదీ, ఎన్నికలలో గెలుపొందని అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీలకు మంత్రి పదవులిచ్చారు.  అంతకు ముందు లోక్ సభ నాయకురాలిగా వ్యవహరించిన సుష్మా స్వరాజ్ అద్వానీ మద్దతుదారు కావటంతో ఆమెను కార్యవర్గానికి దూరంగా ఉంచారు.  ఎన్నికల సమయంలో తనకి అండదండలుగా ఉండి శ్రమించిన అమిత్ షా కి పార్టీ పగ్గాలే చేతికందేట్టుగా చేసారాయన.  ఎన్నికలలో పోటీయే చెయ్యని నిర్మలా సీతారామన్ ని మంత్రిని చేసారు.  

ఇక ఒక ఐఏఎస్ అధికారి సేవలను అందుకోవటం కోసం ఏకంగా చట్టంలోనే సవరణ తీసుకునివచ్చారు మోదీ.  టెలికాం రెగ్యులేటరీ అధారిటీ (ట్రాయ్) కి ఛైర్మన్ పదవిలో సేవలందించిన నృపేంద్ర  మిశ్రాని ప్రధానమంత్రి ఛీఫ్ సెక్రటరీగా నియమించటం కోసం ట్రాయ్ లో ఛైర్మన్, ఇతర సభ్యులుగా పనిచేసినవారికి రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వంలో వేరే శాఖల్లో పనిచెయ్యటానికి అనుమతించరాదన్న నియమంలో సవరణను బిల్లుగా ఇరు సభల్లోనూ ప్రవేశపెట్టి చట్టబద్ధం చెయ్యటం జరిగింది.  

ప్రధానమంత్రిగా అధికారాలను చేపట్టినవారిని తనకి అనుకూలంగా పనిచేసే బృందాన్ని కాకుండా వేరేవాళ్ళని పెట్టుకోమని ఎవరూ అనరని అనటానికి కూడా లేదు.  అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకి అనుకూలంగా పనేచేసేవాళ్ళని మంత్రి వర్గంలో పెట్టుకుందామనుకుంటే అధిష్టానం పడనివ్వలేదు.  కానీ ఇక్కడ శక్తివంతమైన మోదీ పరిపాలన కాబట్టి, ఆయన తనకి ఎదురులేకుండా చేసుకుంటున్నారు.  

మన కుటుంబాలను కానీ, పొరుగువారిని కానీ ఎంపికచేసే అధికారం మనకుండదు.  కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తనతో పనిచేసే మంత్రులను తనకి అనుకూలంగా ఉండేవాళ్ళని తనతోపాటు పనిచెయ్యటానికి ఎన్నుకునే వెసులుబాటుని రాజ్యాంగం  కలిగించింది.  దాన్ని మోదీ పూర్తిగా వాడుకున్నారు  ఇంకా వాడుకుంటారు కూడా.

అందువలన, వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే నన్న సామెత నిజమేనన్నది రూఢి అవుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles