Brics bank presidency to india

BRICS Bank first presidency to India, Brics bank head quarters in China, BRICS New Development Bank

BRICS Bank first presidency to India as decided in the Brics summit held in Brazil

బ్రిక్స్ బ్యాంక్ కి అంకురార్పణ, భారత్ కి తొలి అధ్యక్ష పదవి

Posted: 07/16/2014 09:45 AM IST
Brics bank presidency to india

దేశాల మొదటి అక్షరాలను కూర్చి బ్రిక్ దేశాలని పిలుస్తున్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు మంగళవారం బ్రెజిల్ లో జరిపిన సమావేశంలో 100 బిలియన్ డాలర్లతో బ్రిక్స్ బ్యాంక్ ను ఏర్పాటు చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నారు.  న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అని పేరిడిన ఈ బ్యాంక్ ఒక్కోసారి ఒక్కో దేశం 5 సంవత్సరాల కాలానికి అధ్యక్షత వహిస్తుందన్న ప్రతిపాదనకు కూడా సర్వసమ్మతి లభించింది.  ఇది భారత దేశంతో మొదలవుతోంది.  అంటే న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ కి తొలి అధ్యక్ష పదవి భారత్ కి దక్కింది.

వర్ల్ డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండంతటి పటిష్టమైన గొప్ప బ్యాంక్ గా న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ని అభివృద్ధి పరచటానికి మంగళవారం బ్రిక్స్ ప్రతినిధులంతా నిర్ణయం తీసుకున్నారు.  ఈ బ్యాంక్ ని సర్వసభ్య దేశాల పరస్పర సహకారంతో స్థానిక బ్యాంక్ లకు చేయూతనిచ్చి అభివృద్ధి పథంలో నడిచేట్టుగా చేస్తాయి.  బ్రిక్స్ దేశాల న్యూడెవలప్ మెంట్ బ్యాంక్, చైనాలో ప్రధాన కార్యాలయాన్ని స్థాపించి కార్యకలాపాలను నిర్వహిస్తుంది.  

యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో సంబంధాలు మెరుగుపరచాలన్న బ్రెజిల్, భారత్ దేశాల చిరకాల కోరికను అందులో వీటో పవర్స్ ఉన్న రష్యా, చైనా దేశాలు విస్మరిస్తూ వస్తున్నాయి.  మంగళవారం బ్రిక్స్ దేశాలన్నీ కలిసి చేసిన తీర్మానంలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో బ్రెజిల్, భారత్ దేశాల ఆకాంక్ష నెరవేరటానికి మద్దతునిస్తామని తెలియజేయటం జరిగింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles