Bjp modi facing difficulties over destruction of 11 100 files

BJP Modi facing Difficulties, bjp, bjp government, nda, destruction of 11100 files modi, 11, 100 files by home ministry, Congress party, Home Minister Rajnath Singh,

BJP Modi facing Difficulties over Destruction of 11-100-Files, destruction of 11,100 files relating to his ministry The Narendra Modi government, congress party fight to bjp government, Destruction of 11, 100 files by home ministry,

బూడిద పై కాంగ్రెస్ పోరు-భయంలో మోడీ?

Posted: 07/16/2014 10:42 AM IST
Bjp modi facing difficulties over destruction of 11 100 files

అధికారంలేని కాంగ్రెస్ పార్టీ బూడిద పై బిజేపి పార్టీతోఫైట్ చేస్తుంది. దీంతో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ లో సరికొత్త భయం పట్టుకుంది. అధికారంలో వచ్చిన వెంటనే.. బిజేపి పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వాటిపై బీజేపి సర్కార్ లోతుగా పరిశీలించి బయటకు తీస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బిజేపి ఒక వివాదంలో పడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. కొన్ని ఆదేశాలు జారీ చేయటం అధికారులు తూ.చ పాటించటం జరిగింది.

దీంతో బీజేపి కొత్త తలనొప్పులు వచ్చాయి. మోడీ ఆదేశాలతో అధికారులు కీలక పత్రాలు ధ్వంసం చేశారు. ఇందులో చరిత్రకు సంబంధించినవి కూడా ఉన్నాయని పత్రికల్లో కథనాలొచ్చాయి. గాంధీజీ హత్యకు సంబంధించిన పత్రాలు ద్వంసం చేశారని ప్రధానంగా ఆరోపణలున్నాయి. దీనిపై సర్కార్‌ సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే 11వేల ఫైల్స్ మాత్రమే ధ్వంసం చేశామని.. ఇందులో విపక్షాలు ఆరోపిస్తున్నట్టు చరిత్రకు సంబంధించిన కీలకపత్రాలేమీ లేవని రాజ్‌నాధ్‌ సింగ్‌ చెబుతున్నారు.

వామపక్షాలు సహా పలు పార్టీలు అధికార పార్టీ తీరును ఎండగడుతున్నాయి. ఒక్కో ఫైల్‌ను 45సెకన్లు కూడా పరిశీలించకుండానే ధ్వంసం చేశారని సీపీఎం ఆరోపిస్తోంది. దీనిని బట్టి చరిత్రకు బీజేపీ ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతుందన్నారు. రాజ్‌నాధ్‌ సింగ్‌ చెబుతున్నట్టు 11వేల ఫైల్స్ ధ్వంసం చేసిన సర్కార్‌ వాటి సమగ్ర వివరాలు ఇవ్వాలని జేడీయూ నేతలు డిమాండ్‌ చేశారు. ధ్వంసం చేసిన పత్రాల వివరాలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని పట్టుబడుతున్నారు.

ఈ వ్వవహారంలో కాంగ్రెస్‌ కూడా బీజేపీని కార్నర్‌ చేస్తోంది. ధ్వంసం చేసిన ఫైల్స్ ను మైక్రో ఫిల్మింగ్‌ చేశారా లేదా అన్నది ప్రభుత్వం చెప్పకపోవడాన్ని తప్పుబడుతోంది. ఆరోపణలున్నట్టు చరిత్రకు సంబంధించిన ఫైల్స్ ఇందులో ఉన్నాయా.. అసలు ఫైల్స్ ధ్వంసం చేసిన విధానంపై కూడా వివరాలు అందజేయాలని కాంగ్రెస్‌ కోరుతోంది. మొత్తానికి బీజేపీకి క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కార్యాలయాలు శుభ్రంగా ఉండాలి... కానీ ముందు వెనకా చూడకుండా అంతా చెత్తే అని బుట్టలో పడేస్తే జరిగే నష్టమేంటో బీజేపీ సర్కార్‌కు ఇప్పుడు తెలిసొస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles