Bhadrachalam temple assets in andhra pradesh for srirama temple in telangana

bhadrachalam temple assets in andhra pradesh, srirama temple in telangana, Chandrababu, kcr, polavaram, polavaram bill pass.

bhadrachalam temple assets in andhra pradesh for srirama temple in telangana

కేసిఆర్ కు రాముడు-చంద్రబాబుక ఆస్తులు!

Posted: 07/15/2014 10:17 AM IST
Bhadrachalam temple assets in andhra pradesh for srirama temple in telangana

ఖమ్మం జిల్లాలోని పోలవరం పై పోరుకు తెరపడింది. పెద్దల సభలో మూడుగంటల పాటు పోరు జరిగిన తరువాత పోలవరం పై పెద్దలు తెరదించారు. దీంతో ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు పూర్తిగా....2 మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం అవుతున్నాయి. అయితే ఈ విలీనం ప్రభావం భద్రాచలం శ్రీరాముడు మీద కూడా పడింది.

దీని వల్ల భద్రాచలం శ్రీరాముడు కేసిఆర్ కు దక్కగా, రాములు ఆస్తులు మాత్రం చంద్రబాబు దక్కటంతో రాముడు భక్తులు ఆందోళన చెందుతున్నారు. ముంపు మండలాలను ఏపీలో కలపనుండడంతో భద్రాచలం ఆలయానికి సంబంధించిన జటాయువు మందిరం కూడా ఏపీలో కలవనుంది. ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రం సమీపంలోని ఎటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది. ఈ గ్రామం ఏపీలో కలవనుండడంతో జటాయువు మందిరం ఆంధ్రప్రదేశ్ సొంతం కానుంది.

రామాయణంలో జటాయువు పాత్ర చాలా ముఖ్యమైనది. జటాయువు ఒక వయసు మళ్లిన గద్ద. రాముడి తండ్రి దశరధుడికి మిత్రుడు జటాయువు. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకు పోతున్నప్పుడు.. రావణునితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత రక్తసిక్త స్థితిలో సీతమ్మకోసం వెతుకుతున్న రాముడికి కనిపించి, రావణుడి వివరాలు చెప్పి వీరమరణం పొందుతాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా దాని దహన సంస్కారాలు చేస్తాడు.

ఇప్పుడు తెలంగాణ సీఎంకు రాముడు దక్కటం, ఆంద్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాముడు ఆస్తులు , జటాయావు మందిరం దక్కటంతో ఖమ్మం జిల్లా వాసులు, రాముడు భక్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేసిఆర్ సర్కార్ మాత్రం సైలెంట్ గా ఉండటంతో పై తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles