It boom in visakhapatnam

IT boom in Visakhapatnam, Benefit of employment to Vyzagets, IT development in AP gives employment opportunities

IT boom in Visakhapatnam

ఏపి లో ఐటి ఊపు

Posted: 07/15/2014 10:30 AM IST
It boom in visakhapatnam

విశాఖపట్నంలో ఐటి కంపెనీలకు భూములివ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావటంతో ఐటి కంపెనీలు కూడా ముందుకొచ్చాయి హైద్రాబాద్ లో లాగా విశాఖలో తమ వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవటానికి.  

విప్రో, టెక్ మహీంద్రా లాంటి సంస్థలు విశాఖలోని ఐటి కారిడార్ లో నెలకొల్పటానికి సిద్ధమవటంతో ఆంధ్ర ప్రదేశ్ యువతకు ఉపాధి కల్పన జరగబోతోంది.  

ఈ రెండు సంస్థల వలన ప్రత్యక్షంగా 12000 మంది ఇంజినీర్లు, కంప్యూటర్ పట్టభద్రులకు, పరోక్షంగా మరో 12000 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి.  దీనితో యువత కాస్త కాళ్ళూ చేతులు కూడగట్టకోవటానికి అవకాశం దొరుకుతుంది.

ఒకసారి మొదలవాలేగాని ఆపటం చాలా కష్టమే అవుతుందన్నట్లు పై కంపెనీలు విశాఖలో కాలుమోపగానే ఇతర కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా వచ్చే అవకాశం ఉంది.  అదే జరిగితే, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కూడా వస్తున్న నేపథ్యంలో వ్యాపారావకాశాలు మెండుగా కనిపించటంతో వాటికి అనుసంధానమైన కంపెనీలు మరెన్నో విశాఖను సాంకేతికరంగంలో ముందుకు తీసుకెళ్తాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles