Ap speaker kodela gets warm welcome at guntur

AP Speaker Kodela gets warm welcome at Guntur, Kodela Siva Prasad 6 times winner in TDP, Kodela massive Rally at Guntur

AP Speaker Kodela gets warm welcome at Guntur

గుంటూరులో కోడెలకు బ్రహ్మరథం

Posted: 06/29/2014 11:07 AM IST
Ap speaker kodela gets warm welcome at guntur

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా నియమితులైన తర్వాత శనివారం మొదటిసారిగా గుంటూరు వెళ్ళిన సందర్భంగా పార్టీ శ్రేణులు, గుంటూరు వాసులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.  ఆయనను పూలమాలాంకృతులను చేసి పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికిన తర్వాత కోడెల భారీ ర్యాలీని చేపట్టగా అందులో పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.  గుంటూరులో మహిళలు  కోడెలకు మంగళ నీరాజనాలిచ్చారు.  

kodela-rally

గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన కోడెల శివప్రసాద్ 2014 ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసే గెలిచారు.  తెలుగు దేశం పార్టీ హయాంలో ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎన్నికయ్యారు.  కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్నప్పుడు ఆ తర్వాత రెండు సార్లు అపజయం ఎదురైనా, మళ్ళీ తెదేపా హవా రాగానే తన సొంత నియోజకవర్గం కాకుండా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు.  ఆయన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పనిచేసారు.  

ఇప్పటి వరకు హోం, హెల్త్, నీటిపారుదల, పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ధి, సివిల్ సప్లైస్ మంత్రిత్వ శాఖలకు నిర్వహించిన కోడెల ప్రస్తుతం శాసనసభ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles