Puri sankaracharya avoids jagannath ratha yatra

Puri Sankaracharya avoids Jagannath Ratha Yatra, Tussle between Puri priests and Sankaracharya, Puri priests and Sankaracharya clash

Puri Sankaracharya avoids Jagannath Ratha Yatra

అయ్యోరు రాకుంటే అమాస ఆగుతదా అన్నట్లు....

Posted: 06/29/2014 11:39 AM IST
Puri sankaracharya avoids jagannath ratha yatra

పూరీలో ఆనవాయితీకి విరుద్ధంగా పూరీ శంకరాచార్యులు లేకుండానే జగన్నాథ రథ యాత్ర కదులుతోంది.  ఈరోజు జగన్నాధ రథం మీద ఉండే అర్చకులకు, పూరీలోని గోవర్ధన పీఠంలోని శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతికి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు ఒకరికొకరు శ్రీముఖాలు పంపించుకునేంత వరకు వెళ్ళాయి.  

నిష్టాగరిష్టులైన శంకరాచార్య పీఠం నుంచి జగన్నాథ రథం మీదకు ప్రజలు ఎక్కి స్వామివారిని తాకరాదని ఆంక్షలు విధించగా, అసలు ఆయన పెత్తనం ఇక్కడేమిటన్నట్లు దైతపతులనబడే అర్చకులు ఆయనకు ఆంక్షలు విధించారు.  శంకరాచార్యులు తమతో ఆదిత్యవాహిని అని పిలవబడే అనుచరగణాన్ని తీసుకుని వెళ్తారు.  కానీ ఒక్క శంకరాచార్యుల వారికే అనుమతి ఉందని, రథారూఢులైన స్వామివారి దర్శనానికి మరెవరూ ఆయనతో రారాదని దైతపతులు నియమాన్ని విధించారు.  

దీనితో ఆగ్రహం చెందిన నిశ్చలానంద స్వామి వారు రథోత్సవానికి పోనేపోనని భీష్మించుకున్నారు.  అది ఆయనిష్టం, ఆయన దర్శనానికి రాకపోయినా మేము మా పని చేసుకుంటాం అంటున్నారు దైతపతులు.  అందువలన ఆయన లేకుండానే రథయాత్ర సాగే అవకాశం కనిపిస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles