Cm chandrababu was hard on yrscp

cm chandrababu was hard on yrscp, chandrababu naidu, yrscp, jagan mohan reddy, ap assembly, tdp mla, yrcp mla, ap assempby session.

cm chandrababu was hard on yrscp

ప్రపంచానికే పాఠాలు చెప్పిన బాబు!

Posted: 06/24/2014 01:56 PM IST
Cm chandrababu was hard on yrscp

ఆంద్రప్రదేవ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబుల వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ తన మార్కు చూపించుకోవటానికి గత మూడు రోజలు నుండి చాలా కష్టపడుతున్నారు. అసెంబ్లీలో జగన్ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పై పోరాటం చేస్తున్నారు. ‘‘ బాబు వచ్చాడు.. జాబు పోయింది’’. బాబు వస్తాడు.. జాబులు వస్తాయని ..సీమాంద్ర ప్రజలను చంద్రబాబు మోసం చేసారని..జగన్ గొంతుచించుకొని అసెంబ్లీ స్పీకర్ కొడెల శివప్రసాద్ కు వినిపించారు.

జగన్ పడుతున్న శ్రమ చూసిన చంద్రబాబు.. త్వరగానే మైకు తీసుకోని.. ఫ్యాన్ కు ఉన్న రెక్కలు విరిసిపారేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని ప్రజలు నమ్మారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు టీడీపీ కట్టుబడి ఉందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో టీడీపీ సఫలమవుతుందని సీఎం బాబు తెలిపారు.

ఈ సందర్భంగా ఆసక్తి కర సంవాదం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ జూనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, తొలి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంకా చాలా చూడాల్సి ఉంది అప్పుడే తొందరపడితే ఎలా? అని ఆయన హితవు పలికారు. వైఎస్సార్సీపీ నేతలు ఇంకా నినాదాలు చేయడంపై బాబు నవ్వుతూ, 'ప్రపంచానికే పాఠాలు చెప్పిన నాకే పాఠాలు చెప్పాలనుకోవడం హాస్యాస్పదమ'ని చంద్రబాబు అన్నారు.

అయితే తల్లి కాంగ్రెస్ ను పిల్ల కాంగ్రెస్ బాగా అనుకరింస్తుందని చంద్రబాబు ఆవేశంగా అన్నారు. పద్దతి ప్రకారం విద్యావ్యవస్థను క్రమబద్దీకరించామని గుర్తు చేశారు. విద్యుత్ శాఖపై ప్రతి రోజు సమీక్షించేవాడినని ముందు ఆ విషయం జగన్ తెలుసుకోవాలని బాబు సూచించారు. అప్పట్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని రోజుల్లో సర్ ప్లస్ బడ్జెట్ సాధించాం, అప్పట్లోనే మిగులు గ్రాంటు సాధించామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అంటే మీ తండ్రి సమయంలో.. టిడిపి మంచి మార్కులు సంపాదించిందని చంద్రబాబు జగన్ కు ఇన్ డైరెక్టర్ చెప్పటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles