Tdp and ysrcp agreement on by elections

TDP and YSRCP agreement on by-elections, By-elections for Allagadda seat, By-elections for Nandigama seat, Bhooma Shobha Nagireddy dies in road accident, Tangirala Prabhakara Rao dies of cardiac arrest

TDP and YSRCP agreement on by-elections

తెదేపా వైకాపా ఉప ఎన్నికల ఒప్పందం?

Posted: 06/24/2014 02:55 PM IST
Tdp and ysrcp agreement on by elections

రాష్ట్రంలో 2014 ఎన్నికలలో గెలుపొంది, మృతి చెందిన ఎమ్మెల్యేల స్థానంలో జరగబోయే ఉప ఎన్నికలకు తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆళ్ళగడ్డలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి ఎన్నికలకు ముందుగానే రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కానీ ఆమె ఆ స్థానంలో ఆమరణాంతర విజయం సాధించారు. అక్కడ జరగబోయే ఉప ఎన్నికలలో ఆమె కూతురుని పోటీలో నిలబెడదామని వైయస్ ఆర్ కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా సమాచారం. అలాగే నందిగామ నుండి తెలుగు దేశం పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల తర్వాత గుండెపోటుతో మరణించారు. ఆ స్థానంలో ఆయన కూతురుని నిలబెడదామని తెదేపా అనుకుంటోందని కూడా సమాచారం.

ఈ ఉప ఎన్నికలలో రెండు పార్టీలూ ఒక ఒప్పందానికి వచ్చినట్లయితే రెండు స్థానాలలోనూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. సామాన్యంగా ఇలాంటి ఒప్పందాలు చాలా సులభంగానే జరుగుతాయి.

చనిపోయిన నాయకుని స్థానంలో ఆ కుటుంబ సభ్యులను నిలబెట్టినప్పుడు వారికి సానుభూతి వోట్లు ఎలాగూ పడతాయని తెలుసు కాబట్టి మిగిలిన పార్టీలు సామాన్యంగా హుందాగా వైదొలుగుతాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles