Jagan powerful speech in assembly

jagan speech in assembly, ysjagan speech in assembly, jagan speech in ap assembly, jagan fire on tdp, jagan fire on cm chandrababu nadidu, ysrcp vs tdp.

jagan powerful speech in assembly, jagan fire on tdp, jagan fire on cm chandrababu nadidu

చొక్క పట్టుకొని మరీ వసూలు చేస్తున్నారు?-జగన్

Posted: 06/23/2014 04:10 PM IST
Jagan powerful speech in assembly

వైఎస్ జగన్ ఈరోజు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేయటం జరిగింది. అయితే ముందుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జగన్ ప్రసంగించారు. వైఎస్ జగన్ అసెంబ్లీ లో ఒక ప్రతిపక్షనేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవటానికి ..విశ్వప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ పరిక్షీకు ప్రిపెర్ అయినట్లు.. జగన్ గ్యాంగ్ రాజకీయంగా ఫ్రిపేర్ అయి వచ్చి.. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటం జరిగింది.

వైసీపీ ఎమ్మెల్యేలు, టిడిపి ఎమ్మెల్యేలు మద్య .. తీవ్రమైన మాటల పోరాటం జరిగింది. అయితే చివరకు వైఎస్ జగన్ చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ.. కొన్నివిమర్శలు చేయటం జరిగింది. చంద్రబాబు అధికారం కోసం అడ్డమైన హామీలు ఇవ్వటం జరిగిందని, వాటి అమలుపరచటంలో పూర్తిగా విఫలమయ్యారని జగన్ దుయ్యపట్టారు.

సీమాంద్ర ప్రజలు చంద్రబాబు వస్తాడని.. మా కష్టాలు తీర్చుతాడని ఆశపెట్టుకున్నాడు. కానీ చంద్రబాబు రావటం అయితే వచ్చాడు గానీ .. ప్రజలు కష్టాలు తీర్చలేదని జగన్ ఆవేశంగా అన్నారు. టిడిపి వస్తే.. సీమాంద్ర లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన బాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. అంతేకాకుండా నిరుద్యోగులకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. కానీ చంద్రబాబు పైసా కూడా చెల్లించలేదు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చాడు, కానీ వాటిని అమలు పరిచే సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారని జగన్ ఆవేశంగా ఆరోపించారు.

jagan-hot-speech-assembly

సీమాంద్రలో 26 వేల మంది ఆదర్శ రైతులను తెలుగుదేశం పార్టీ గాలికొదిలేసిందని జగన్ గుర్తించారు. బాబు అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతుందని సీమాంద్ర ప్రజలు ఆశపడ్డారు, కానీ ఉచిత విద్య అందించకపోగా, సీమాంద్రలో స్కూళ్లకు వెళ్లితే..‘‘చొక్కా పట్టుకుని ఫీజులు వసూలు చేస్తున్నారని జగన్ తెలిపారు. ’’(పాపం జగన్ ను ఎవరు చొక్కా పట్టుకుని ఫీజులు అడిగారో) . అందుకే అసెంబ్లీలో జగన్ రెచ్చిపోయి టిడిపి ఉతికేసారని రాజకీయ నేతలు అంటున్నారు.

అయినా జగన్ ఇలా గొంతుచించుకోని అసెంబ్లీలో అరిస్తే.. మీడియాలో కనిపిస్తావ్ గానీ, సీమాంద్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజం లేదు. ఎందుకు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే.. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తే.. నష్టం భారీ జరుగుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. గత 5 సంవత్సాల నుండి చంద్రబాబు పై దుమ్మెత్తి పోస్తున్నావు. కొత్తగా ఆలోచించు జగన్ ? రాజదాని లేని సీమాంద్ర ప్రజలకు ఏదైన ఉపయోగపడే పని చేయమని ప్రజలు అడుగుతున్నారు. జగన్ నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా, చంద్రబాబు లో ఎలాంటి మార్పు రాదు. ఆయన రూటులోనే ముందుకు సాగిపోతాడని .. సీమాంద్ర ప్రజలకు బాగా తెలుసు.

ఒక ప్రతిపక్ష నేతగా ..బాబు పై విమర్శలు చేసి ఉన్న పరువు పొగొట్టుకోవటం కంటే.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటే.. భవిష్యత్తులో.. సీఎం కూర్చీ దక్కే అవకాశం ఉందని .. రాజకీయ మేథావులు చెబుతున్నారు. ‘‘అసెంబ్లీలో మీ అరుపులు సీమాంద్ర ప్రజలకు అన్నం పెట్టలేవు’’ చేతల్లో ఏదైన చూపిస్తే.. త్వరగా సీమాంద్ర రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. రాజకీయ నాయకులు ఆ దిశగా ఆలోచించాలని సీమాంద్ర ప్రజలు కోరుతున్నారు. ఈ 5ఏళ్లలో.. జగన్ , చంద్రబాబుల మద్య ఇలాంటి మాటల యుద్దం ఎన్నిసార్లు జరుగుతుందో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles