Ys jagan accepts his failure in assembly

YS Jagan accepts his failure in assembly, ys jagan, ys jagan in ap assembly, ys jagan speech in assembly, ys jagan comments on chandrababu naidu, ys jagan comments on narendra modi, ys jagan comments on congress party, ys jagan accepts his failure in electioins, ys jagan accepts his defeat in elections

YS Jagan accepts his failure in assembly,

తన నిజాన్ని బయటపెట్టుకున్న జగన్

Posted: 06/23/2014 03:37 PM IST
Ys jagan accepts his failure in assembly

(Image source from: YS Jagan accepts his failure in assembly )

అవును... చాలారోజుల తరువాత జగన్ తనకు సంబంధించిన ఒక నిజాన్ని బయటపెట్టారు. ‘‘ఎన్నికల ముందు నేను చేసింది ఓవర్ కాన్ఫిడెన్సే’’ అనే రీతిలో జగన్ ఈరోజు అసెంబ్లీలోని తన ప్రసంగంలో చెప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే ఎన్నికవుతా’’నని ప్రచార నేపథ్యంలో జగన్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అప్పట్లో ఈయన చేసిన వ్యాఖ్యలు, వ్యవహారాలను చూసి రాజకీయ విశ్లేషకులు తమ బలహీనతల గురించి పరీక్షించుకున్నారు కూడా! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ పార్టీయే గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసుకున్నారు. కానీ ఎన్నికల తరువాత అందరి బండ్ల టైర్లకు పంక్చర్ అయిపోయింది. తాము ప్రదర్శించింది ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెలుసుకుని అందరూ నోళ్లవేలు పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు.

ఇదే విషయాన్ని తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఎన్నికల ముందు తాము ప్రదర్శించిన ఓవర్ కాన్ఫిడెన్స్ అని సభాముఖంగా ఒప్పుకోక పోయినా... అందుకు భిన్నంగా జవాబిచ్చారు. ఆత్మవిశ్వాసమే తమను దెబ్బతీసిందని అందరి సమక్షంలోనే తన నోటితో నిజాన్ని వెళ్లగక్కుకున్నారు జగన్. అలాగే అత్యధిక మెజారిటీతో పార్టీని గెలిపించుకున్న చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా... ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ప్రతిపక్షాల మధ్య మాత్రమే గట్టి పోటీ జరిగిందని చెప్పారు.

అలాగే కాంగ్రెస్ బలహీనతల గురించి జగన్ బయటపెడుతూ... ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం చేసింది మొదటి తప్పు అయితే... రైతులకు రుణమాఫీలు చెల్లించకుండా మరొక తప్పు చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్రస్ లేకుండా కొట్టుకుపోయింది. నరేంద్రమోదీ హవా ఎక్కువగా వున్న నేపథ్యంలో... ఆయన చేసిన ప్రచారాల కారణంగానే తెలుగుదేశం పార్టీ గెలిచింది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ప్రతిపక్షం అంటే అన్ని వ్యవహారాల్లోనూ వ్యతిరేకంగా వుండటం కాదు. మేము తెదేపా పార్టీకి అన్నివిధాలుగా మద్దతునిస్తాం. ఎన్నికల ముందు మేమిచ్చిన హామీలను చంద్రబాబు పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను’’ అని తన ప్రసంగాన్ని ముగించేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles