Minister harish rao over responds power issue

Harish rao over responds power issue, Minister Harish rao over responds power issue, power issue, andhrapradesh state, telangana state.

Minister Harish rao over responds power issue

మంత్రి హారీశ్ రావు భలే చెప్పారు?

Posted: 06/19/2014 01:59 PM IST
Minister harish rao over responds power issue

టీఆర్ఎస్ పార్టీల్ పవర్ పుల్ నేత అని అందరు చెబుతున్నారు. డైనమిక్ నేత గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం .. తెలంగాణకు వచ్చే కరెంట్ పై లేఖలు రాయటం జరిగింది. దీంతో వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పై తెలంగాణ మంత్రి హారీశ్ రావు కరెంట్ పైర్ అయ్యాడు.

ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న విద్యుత్ యుద్దం .. మంత్రి హరీశ్ రావు .. దైర్యంగా మాట్లాడటం జరిగింది. అంటే ఆయన పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని వాదించే గుణం ఆయనలో బలంగా ఉంది. కేంద్రం చేసిన ఒప్పందం ప్రకారమే తెలంగాణకు కరెంట్ రావాలని ఆయన డిమాండ్ చేయటం జరిగింది. ఆయన దూకుడు అంత తెలంగాణ ప్రజలకు కోసమే.

ఆయన ఆవేశం అంత తెలంగాణ ప్రాంతం అబివృది చేయాలనే తపన హరీశ్ రావులో కనిపిస్తుంది. కానీ అందరు బాగుండాలని కోరుకునే హరీశ్ రావు. ఇలామాట్లాడటం అంత బాగాలేదు. పదేళ్ల ఉమ్మడి రాష్ట్రంలో మీ సెక్రటేరియట్.. మీ అసెంబ్లీ..మీ డీజీపీ ఆఫీసులు ఉన్నాయి. వారికి విద్యుత్ వద్దా? అంటూ తనదైన శైలిలో దైర్యంగా బెదిరింపు ధోరణిలో మీడియా ముందు మాట్లాడటం జరిగింది.

అంటే హరీశ్ మంత్రి అయిన తన పద్దతి మార్చుకోలేదు. ఉద్యమం చేసినప్పుడు ఎలా ఉన్నాడో ..ఇప్పుడు అలాగే ముందుకు దూకుతున్నాడు. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తున్నారు. సమన్యాయం కావాలనుకుంటే.. ఇరు ప్రాంతాల నేతలు, పెద్దలు కూర్చోని మాట్లాడి సమస్యను పరిష్కారించుకోవాలి.అంతేగానీ .. మీరు కరెంట్ ఇవ్వకపోతే..మాకు చాలాఆలోచనలు ఉన్నాయని..చిన్నపిల్లల ధోరణిలో మాట్లాడి, మంత్రిగా హరీశ్ గౌరవం తగ్గించుకుంటున్నాడు. మీ ఇంటికి మాఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అనే విషయం మంత్రిగారు ఎలా మరిచిపోయరో అర్థంకావటం లేదని ..రాజకీయ మేథావులు అంటున్నారు.

రెండు రాష్ట్రాల పెద్దలు కలిసి మాట్లాడుకొని.. త్వరలో ఈ కరెంట్ సమస్యను సామరస్యంగా పరిష్కారించుకోవాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles