Rented houses preferred by cine people

rented houses preferred by cine people, Senior actors have own houses, Coming up cine artists prefer rented houses

rented houses preferred by cine people

అద్దిల్లే ముద్దంటున్న సినీతారలు

Posted: 06/19/2014 02:22 PM IST
Rented houses preferred by cine people

మార్కెట్ కి వెళ్ళి టమాటాల ధర ప్రియంగా ఉన్నాయని తెలిసి, టమాటాలు ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్లుగా కొందరు వర్థమాన తారలు అద్దె ఇల్లే నయం అని అంటున్నారు.  ఎందుకంటే, సినీరంగ ప్రముఖులకు ముంబైలో తలదాచుకునేందుకు తమ హోదాకు తగ్గ చోటుకోసం ఇప్పటికీ సమస్యగానే ఉంటోంది.  పైగా సినీ రంగంలో అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎక్కడ వస్తాయో కూడా తెలియదు.  అద్దె ఇల్లయితే సులభంగా మారిపోవచ్చు.  నటి ఇలియానా విషయమే తీసుకుంటే ఆమె హైద్రాబాద్ లో ఇల్లు కొని అందులోకి వెళ్ళకముందే ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.  

ముంబైలో కొంతమంది కళాకారులను కదిపి చూస్తే వాళ్ళ స్పందన ఇలా ఉంది.

rented-houses1వెరోసోవా అపార్ట్ మెంట్ లో ఒకటిన్న సంవత్సరాల నుంచి అద్దెకుంటున్న నవాజుద్దీన్ సిద్దిక్వి ని అడిగితే, నాకు నచ్చిన పాత్రల్లో నటించటంలోనే నాకు ఎక్కువ ఆనందముంది.  నేను ముంబై వచ్చింది సినిమాల్లో మంచి పాత్రల్లో రాణించటానికి కానీ ఇక్కడో ఇల్లు కట్టుకుని ఉండటానికి కాదు అంటారు.  అయితే ఆ రోజు వచ్చి, మంచి ఇల్లు దొరికి దాన్ని నేను కొనగలిగే స్థితికి వస్తే తప్పక కొంటానని కూడా అంటున్నారు.

అమిత్ సాధ్ తను అద్దెకి ఉంటున్న ఫ్లాట్ అద్దె ఒప్పందాన్ని రెన్యూ చేయించకపోవటంతో రోడ్డుమీదకు వచ్చాడు.  అయినా అద్దె ఇల్లే నయం.  కొనటం చాలా కష్టం అంటున్నాడు.  అయితే అద్దె కోసం పోయినప్పుడు మీ ఫ్లాట్ కి అమ్మాయిలు వస్తుంటారా అని అడుగుతారు.  ఇప్పుడు బాంద్రాలో అద్దెకు ఇల్లు తీసుకున్నానని, అదృష్ట వశాత్తూ ఇంటివాళ్ళు అలాంటి ప్రశ్నలు అడగరని అన్నాడాయన.

rented-houses-2వ్యాపార రీత్యా చూసుకున్నా ముంబైలో ఇళ్ళ మీద పెట్టుబడి పెట్టటం లాభసాటే కానీ ధరలు ఆకాశానికంటుతున్నాయి.  ఇప్పుడప్పుడే నేను కొనలేను అని అన్నారు దర్శకుడు బిజోయ్ నంబియార్.

rented-houses-6సన్నీ లియోన్ రెండు సంవత్సరాలుగా సెలీనా జైట్లీ యారీ రోడ్ లో పెంట్ హౌస్ లో అద్దెకుంటోంది.  సొంతింటి మాటెత్తితే, చాలా దేశాలలో ఇళ్ళున్నాయి.  ఇక్కడ ముంబైలో కూడా ఏదైనా మంచి ఇల్లు కనబడితే కొనే అవకాశం ఉంది అని అంటోంది.

వెర్సోవా అపార్ట్ మెంట్ లో నాలుగు సంవత్సరాలుగా ఉంటున్న దర్శకుడు ఓనిర్, నాకు అద్దె ఇల్లు చాలు.  నాకేమీ రిటైరైన తర్వాత ముంబైలో ఉండాలని లేదు.  అయినా అద్దె ఇళ్ళల్లోనే ఒకింత స్వేచ్ఛ ఉంటుంది.  నాకు ఇంటి యజమానులతో ఇంత వరకు ఏ సమస్యా లేదు అన్నారు.

rented-houses-3తాప్సీ పన్ను ముందుగా ముంబై గురించి ఇంకా బాగా తెలియాలని అంటోంది.  నగరం బాగా తెలిస్తే ఎక్కడ ఇల్లు తీసుకోవాలో బాగా అర్థమౌతుంది.  పైగా ఇక్కడ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  మారుతుండే అవకాశాలతో హెచ్చు తగ్గులుండే ఆదాయ వనరుల వలన మాకు ఋణాలు రావటం కష్టం.  అది పెద్ద అడ్డంకి అంటోంది.

మలాడ్ లో వెర్సోవా అపార్ట్ మెంట్ లో నివాసముండే ఎల్లి ఆవ్రమ్ బాంద్రాకి తన నివాసాన్ని మార్చుకుంది.  బ్యాంక్ లోన్ గురించి మాట్లాడుతూ, అది చాలా సమయనష్టం గావించే పని, అందులో బోలెడన్ని అవరోధాలు.  మరో అడ్డంకి గ్యారెంటర్లు దొరకరు.  అందువలన అద్దెకు దొరకటం కూడా మాలాంటివాళ్ళకి ముంబైలో కష్టమే అయినా అదృష్టవశాత్తూ మంచి ఇంటి యజమాని, సహకరించే హౌసింగ్ సొసైటీ దొరికింది అని చెప్పింది.  

ఇంకా ఎందరో అద్దె ఇళ్ళల్లోనే ఉంటున్నారు.  వాళ్లల్లో చిత్రాంగద సింగ్, జాక్విలైన్ ఫెర్నాండెజ్, అదితిరావ్ హైదరి, నర్గీస్ ఫక్రి, విద్యుత్ జామ్వాల్, యామి గౌతమ్, రాజ్ కుమార్ రావ్, రిచా ఛడ్డా, ఇమ్తియాజ్ అలి, ప్రభుదేవా ఉన్నారు.  

rented-houses-9సీనియర్ నటీనటులకు సొంతిళ్ళు దండిగా ఉన్నాయి.  సమస్యంతా ఈ మధ్యకాలంలో ముంబైలో అడుగుపెట్టిన కళాకారులకే.  అజయ్ దేవ్ గన్ కి ముంబైలో ఇల్లే కాక కర్జత్ లో ఫాంహౌస్ ఉంది.  జాన్ అబ్రహామ్ కి బాంద్రాలో డూప్లెక్స్ తో పాటు 60000 చదరపు అడుగుల జాగా ఉంది.  సోనూ సూద్ కి ఆరు ఇళ్ళు, ప్రియాంకా చోప్రా కి 10 ఇళ్ళున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles