Chandrababu has magig wand

Chandrababu has magig wand, Andhra Pradesh deficit budget, Prime Minister Narendra Modi developmental activities, Chandrababu optimism, Chandrababu fixes targets to develop AP state

Chandrababu has magig wand

బాబు దగ్గర మంత్ర దండం?

Posted: 06/17/2014 09:38 AM IST
Chandrababu has magig wand

ఖజానా ఖాలీయే కానీ హామీలు నెరవేరుతాయి.  చెయ్యాల్సినపని చాలావుంది, చేతిలో డబ్బుల్లేవు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునాదుల స్థాయి నుంచి నిర్మించుకుంటూ రావాలి.  కానీ ఖజానా ఖాళీ.  ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితి.  ప్రధాన మంత్రి మోదీ సహకారంతో గట్టెక్కే ప్రయత్నం చేస్తాం.  ఏది ఏమైనా ఇచ్చిన హామీలను పూర్తి చేస్తాం-  ఇవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం రామకుప్పంలో అన్న మాటలు.

పరిస్థితి తేటతెల్లంగా ఉంది.  చేతిలో డబ్బుల్లేవు.  ఏ అభివృద్ధి కార్యక్రమం చేపడదామన్నా ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది.  అయినా చంద్రబాబు నాయుడు ఆశవీడకపోవటమే కాకుండా కార్యకర్తలను, సామాన్య ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు.  నిరాశలోకి పోనివ్వటంలేదు.  

ఇదీ అసలు సవాల్.  మేనేజ్ మెంట్ అంటే ఇదే.  డబ్బులుంటే మేనేజ్ చెయ్యటానికి పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు.  ఆ డబ్బే చాలావరకు మేనేజ్ చేస్తుంది.  అది లేనప్పుడే చేతులు, కాళ్ళూ బంధించిన పరిస్థితి ఉన్నప్పుడే మేనేజ్ చెయ్యటంలో వ్యక్తి సామర్థ్యం బయటపడుతుంది.  

ఉన్న సమస్యలు రాజధాని నిర్మాణం, సాగునీటి సమస్యలు, రాష్ట్రాభివృద్ధి తదితరమైనవి.  మీ అందరి ముఖాల్లో నవ్వులు చూడాలన్నదే నా ఆశయం అన్నారు చంద్రబాబు.  

హైద్రాబాద్ ని తీర్చిదిద్దింది తానేనని గుర్తు చేసిన చంద్రబాబు అలాంటి నగరాలను నాలుగైదు నిర్మస్తాం నవ్యాంధ్రలో అన్నారు చంద్రబాబు.  మరి ఆ పనులన్నీ చెయ్యటానికి కావలసిన సొమ్ము లేదు సరికదా, ఎలా వస్తుందన్నదానిలో కూడా స్పష్టత లేదు.  కానీ చంద్రబాబు నాయుడు చూపించింది గుండె ధైర్యం, అందరిలో నింపింది ఆత్మవిశ్వాసం.

ఇలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ముందు దేశాన్ని అభివృద్ధి చేస్తానని, అవనీతిని పారద్రోలుతానని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి రప్పిస్తానని అన్నప్పుడు కాంగ్రెస్ ఎద్దేవా చేసింది- ఏం మోదీ దగ్గరేమైనా మంత్రదండముందా అంటూ.  ఎలా చేస్తారా పనులన్నీ.  ఒక్కాసారే మార్పులు వచ్చేస్తాయా అంటూ ప్రశ్నించింది అప్పటి అధికార పార్టీ.  మేమే 60 సంవత్సరాలలో చెయ్యలేనిది ఆయనెలా చేస్తారన్నది కాంగ్రెస్ వాదన.  

అలాగే చంద్రబాబు నాయుడు మాటలు ఈ రోజు హాస్యాస్పదంగా కనిపించవచ్చు.  కానీ లక్ష్యమనేది పెట్టుకోవాలి వనరులను సమీకరించుకోవాలి, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలి.  లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటాం అన్నది తర్వాత సంగతి కానీ లక్ష్యం వైపుగా అడుగులైతే పడతాయి కదా!

రెండు నెలల్లో రాష్ట్రంలోని సంక్షోభమంతా పోతుందని చంద్రబాబు నమ్మకంగా చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles