పై ఫోటోలో ట్రాఫిక్ లో చిక్కుకున్న ఆంబులెన్స్ ని చూడవచ్చు
సమయం చాలా విలువైనది. రోగగ్రస్తులకు మరీ. సమయానికి హాస్పిటల్ కి చేరుకోలేక ప్రాణాలు పోగొట్టుకున్న రోగులు ఎందరో! ఆంబులెన్స్ తప్పుకోండి తప్పుకోండంటూ తన భాషలో నీలిరంగులో మొత్తుకుంటున్నా, తప్పుకుని దారిద్దామనే ఉద్దేశ్యం వాహనచోదకులకు ఉన్నా, ట్రాఫిక్ లో వెసులుబాటు లేనప్పుడు వెహికిల్స్ ఎక్కడికి తప్పుకుంటాయి? ఆంబులెన్స్ లో ప్రాధమిక చికిత్సకు ఏర్పాట్లున్నా దానికీ ఒక సమయ పరిమితి ఉంటుంది.
మామాలు వైద్య చికిత్సలోనే ఇన్ని ఇక్కట్లున్నప్పుడు కీలకమైన గుండె మార్పిడిలాంటి సందర్భాల్లో సమయానికి ఎంత విలువుంటుందో ఆలోచించండి. కాలపరిమితిని ఒక క్షణం దాటినా అంత విలువైన అవయవం పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఆ ప్రాణాలను కాపాడే అవయవ మార్పిడికి కీలకమైన మరొకరి అవయవం ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్ లో ఉన్న రోగికి చేర్చాలంటే. ఆ మధ్యలో ట్రాఫిక్ చాల ఎక్కువగా ఉంటే.
అలాంటి సందర్భంలో ఇక్కడ వాహనం, అక్కడ సర్జన్లు, రోగి అవయవ మార్పిడికి తయారుగా ఉండటమే కాకుండా మధ్యలో వాహనం ఎక్కడా ఆగకుండా ఉండాలి. ఈ అద్భుతం చెన్నైలో జరిగింది.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుంచి ఫోర్టిస్ మలార్ హాస్పిటల్ కి మధ్య దూరం 12 కిలోమీటర్లు. దీన్ని 14 నిమిషాల్లో అధిగమించాలి. ఈ మధ్యలో రోడ్ మీద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన హాస్పిటల్ సర్జన్లు, ట్రాఫిక్ పోలీస్ అనుసంధానంతో ఆ గుండెకాయను తీసుకెళ్తున్న వాహనానికి ఎక్కడా అంతరాయం కలుగకుండా ఉండటం కోసం గ్రీన్ కారిడార్ ని ఏర్పాటు చేసారు ట్రాఫిక్ పోలీసులు. అంటే మధ్యలో ఎక్కడా రెడ్ లైట్ తగలదు. పోలీసులు, డాక్టర్లే కాకుండా సామాన్య ప్రజలు కూడా సహకరించి రోడ్డు మీద వాహనానికి అవరోధం ఎక్కడా కలుగుకుండా చూసారు.
ఫోర్టిస్ మలార్ హాస్పిటల్ లోని ఛీఫ్ ఎనస్తీషియిస్ట్ డాక్టర్ సురేష్ రావ్ ఈ ఉదంతాన్ని వివరిస్తూ, గుండె హాస్పిటల్ కి చేరుకోగానే మరో వ్యక్తిలో దాన్ని ప్రవేశపెట్టామని, రాత్రి 10.15 కి ఆ గుండె మరో కొత్త గూడులో ఆడటం మొదలుపెట్టిందని చెప్పారు.
ఇలాంటి ట్రాఫిక్ నియంత్రణలు విఐపి ల రాకపోకలకు జరుగుతుంటాయి. కానీ ఈ సంఘటనలో ఒక సామాన్య మానవుడి ప్రాణాలను కాపాడటం కోసం అంత కసరత్తు చెయ్యటం మానవతా దృష్టిలో ఎంతో ప్రశంసనీయమైంది.
గుండె మార్పిడికి హృదయపూర్వకంగా సహకరించిన చెన్నైవాసులు కూడా ప్రశంసనీయులు.
అయితే, ఇది మొదటిసారి కాదు. 2012 లో కూడా గ్రీమ్స్ రోడ్ లో ఉన్న అపోలో హాస్పిటల్ నుంచి అడయార్ లో ఉన్న ఇదే ఫోర్టిస్ మలార్ హాస్పిటల్ కి గుండెను తరలించటం జరిగింది. మామూలుగా ఈ రెండు హాస్పిటల్స్ మధ్య అరగంట పట్టే సమయం ట్రాఫిక్ నియంత్రణ వలన 11 నిమిషాల్లో చేరుకుంది.
ఈ ప్రక్రియను ఫోర్టిస్ మలార్ హాస్పిటల్ లో ఎలా చేస్తారో ఈ వీడియో చూడండి.
{youtube}VcrT9LlXKqU|620|400|1{/youtube}
మానవ హృదయాన్ని గరిష్టంగా 24 గంటలు పాడవకుండా ఉంచవచ్చు. కానీ అవయవ మార్పిడికి ఎంత త్వరగా ఉపయోగిస్తే అంత మంచిది. విజయానికి అంత ఎక్కువ పాళ్ళల్లో అవకాశం ఉంటుంది.
ఇది జరిగిందిలా-
5.45 కి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఫోర్టిస్ మలార్ కి ఒక గుండె మార్పిడి కోసం తయారుగా ఉందని తెలియజేయటం జరిగింది.
అదే సమయంలో పోలీసులుకూ తెలియజేయటం జరిగింది. పోలీసులు వెంటనే మార్గాన్ని ఖరారు చేసి ఆ మధ్యలో ఉన్న 12 కూడళ్ళల్లో పోలీసు సిబ్బందిని నిలబెట్టారు.
6.39 కి భద్రపరచిన గుండెను లోడ్ చెయ్యబడింది.
6.44 కి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఆంబులెన్స్ బయలుదేరింది.
ఆంబులెన్స్ 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది. ఎప్పిటికప్పడు అది ఎక్కడున్నదన్నది పోలీస్ కంట్రోల్ రూంకి, కూడళ్ళలో ఉన్న పోలీసు సిబ్బందికి తెలియజేయబడింది.
6.57 కి అంటే 14 నిమిషాల్లో ఆంబులెన్స్ ఫోర్టిస్ కి చేరుకుంది. మామూలుగా అయితే 45 నిమిషాలు పడుతుంది.
జయహో చెన్నై!
ఇంత అనుసంధానాన్ని హైద్రాబాద్ ట్రాఫిక్ లో మనం ఊహించుకోగలమా?
ప్రస్తుతం లేదు కానీ చూద్దాం! కొత్త ప్రభుత్వాలు ఏర్పడి హైద్రాబాద్ ని ప్రపంచంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కొంతకాలానికి ఇది సాధ్యపడవచ్చు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more