Students scaled everest praised in telangana assembly

Students scaled Everest praised in Telangana Assembly, Telangana CM KCR praises two students claimbed Everest, Students claimbed Everest to get 25 lakhs each

Students scaled Everest praised in Telangana Assembly by Cgief Minister KCR

ఎవరెస్ట్ ని అధిరోహించిన తెలంగాణా బిడ్డలకు ప్రశంస

Posted: 06/14/2014 05:07 PM IST
Students scaled everest praised in telangana assembly

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు విద్యార్థులు ఆనంద్, పూర్ణలను అభినందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తెలంగాణా శాసనసభలో తీర్మానం చేసారు.  వారిరువురూ దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసారని ప్రశంసిస్తూ, వారితో పాటు వారికి అత్యుత్తమ శిక్షణనిచ్చిన శేఖరబాబుని కూడా కెసిఆర్ అభినందించారు.

సాదనపల్లి ఆనంద్ కుమార్, మాలవత్ పూర్ణ ఇద్దరు విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు.  వారిరువురితో పాటు శిక్షకుడు నల్గొండ వాసి శేఖరబాబుకి తలా 25 లక్షల రూపాయల బహుమతిని కెసిఆర్ శాసనసభలో ప్రకటించారు.  

దానితోపాటు విద్యార్థులిద్దరూ నిరుపేద కూలీల కుటుంబానికి చెందినవారవటం వలన వారిద్దరికీ చెరో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని, దానిలో బోర్ వెల్ ని, సంవత్సరానికి సరిపడా వ్యవసాయానికి ఆర్థిక సహాయాన్ని కూడా కెసిఆర్ ప్రకటించారు.

anand-purna

ఖమ్మం జిల్లాకు చెందిన ఆనందకుమార్ అన్నపురెడ్డిపల్లి లో జూనియర్ ఇంటర్ చదివే విద్యార్థి.  నిజామాబాద్ కి చెందిన పూర్ణ తాడ్వాయి లో 9 వ తరగతి విద్యార్థిని.  వీరిద్దరూ శేఖరబాబు నేతృత్వంలో ఎవరెస్ట్ ని అధిరోహించటానికి 72 రోజుల టూర్ లో వెళ్ళారు.  పై ఫొటోలో వీరిరువురినీ మొదటి నుంచి ప్రోత్సహించిన మాజీ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ ని చూడవచ్చు.  వీరివురు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో చదువుకుంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles