Narayana murthy bids adieu to infosys again

Narayana Murhty leaves Infosys, Narayana Murthy bids adieu to Infosys again, Narayana Murthy leaves Infosys second time in three years, Narayana Murthy leaves infosys giving free hand to new ceo Sikka

Narayana Murthy bids adieu to Infosys again

ఇన్ఫోసిస్ కి మూర్తి మరోసారి గుడ్ బై !

Posted: 06/14/2014 04:46 PM IST
Narayana murthy bids adieu to infosys again

ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ కి ఈరోజు మరోసారి గుడ్ బై చెప్పారు.  మూడు సంవత్సరాలలో నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ కి బైబై చెప్పటం ఇది రెండవసారి.  

1981 లో మరో నలుగురు టెకీలతో కలిసి ఇన్ఫోసిస్ ని స్థాపించిన నారాయణ మూర్తి కంపెనీ నియమాలకు అనుగుణంగా 65 సంవత్సరాలు నిండటంతో ఆగస్ట్ 2011 లో పదవీ విరమణ చేసారు.  అయితే ఆయన మళ్ళీ రావాలి, ఏటవాలుగా పడిపోతున్న లాభాల నుంచి కంపెనీని ఉద్ధరించాలంటూ కంపెనీ బోర్డ్ ఆయనను జూన్ 1, 2013 న సాదరంగా ఆహ్వానించి ఐదు సంవత్సరాలు కంపెనీ పగ్గాలు పట్టుకోమని కోరింది.    

కానీ విశాల్ సిక్కా ని సిఇఓ గా నియమించటంతో తన రెండవ టెర్మ్ ని ఒక సంవత్సరంలో అంతం చేస్తూ, అధికారం కొత్త మేనేజ్ మెంట్ కి మారటం చాలా సున్నితంగా జరగాలని అభిలషిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నానని, దానితో సిక్కా కి స్వతంత్రంగా పనిచేసే వెసులుబాటు కలుగుతుందని చెప్తూ సిక్కా ఇన్ఫోసిస్ ని టెక్నాలజీ ప్రపంచంలో ముందుకు తీసుకునిపోతారని ఆశిస్తున్నానని అన్నారు.  ఈ విషయాన్ని మూర్తి రాబోయే కంపెనీ 33 వ వార్షిక సాధారణ సమావేశానికి ముందుగానే వెల్లడి చేసారు.  

చాలా కొద్ది మందికే ఇలా రిటైర్ అయిన తర్వాత మరోసారి సంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుందని, అందుకు తనకు చాలా ఆనందంగా ఉందని,  నారాయణ మూర్తి తన వీడ్కోలు సభలో తోటి ఉద్యోగులు, క్లయింట్లు, పెట్టుబడిదారులు, ఇతర కంపెనీతో ముడిబడ్డ వారితో అన్నారు.

ప్రయత్న లోపం లేకుండా శాయశక్తులా తను చేసిన పనితో తాను సంతృప్తికరంగా వెళ్ళిపోతున్నానని, తను వదిలిపెట్టిన చోటి నుంచి సిక్కా చాలా సులువుగా కంపెనీని ముందుకు నడిపిస్తారని నారాయణమూర్తి ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles