Telangana qualifies for special status kcr says

Telangana qualifies for special status KCR says, AP not fit for Special status, Polavaram design change resolution in Telangana Assembly

Telangana qualifies for special status KCR says

ప్రత్యేక హోదాకి తెలంగాణాకే అర్హతలున్నాయి- కెసిఆర్

Posted: 06/14/2014 03:49 PM IST
Telangana qualifies for special status kcr says

ప్రత్యేక హోదాకి (ఆంధ్రాకి లేవు కానీ) తెలంగాణాకి అర్హతలున్నాయని, అందువలన తెలంగాణాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శాసనసభలో తీర్మానం చేసారు.  ప్రత్యేక హోదాకి కావలసిన అన్ని అర్హతలూ తెలంగాణాకి ఉన్నాయని, విభజించిన రెండు రాష్ట్రాలను సమానమైన ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకోవాలని కెసిఆర్ అన్నారు.  

పోలవరం అర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని కూడా కెసిఆర్ శాసనసభలో తీర్మానం చేసారు.  ఖమ్మం జిల్లాలో భద్రాచలం జోన్ లోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపటం రాజ్యాంగ విరుద్ధమని, అందువలన ఆ ఆర్డినెన్స్ ని రద్దు చెయ్యాలని మరో తీర్మానాన్ని కూడా కెసిఆర్ ప్రవేశపెట్టారు.   

ప్రస్తుతమున్న పోలవరం డిజైన్ ని మార్చకుండా అమలు చేస్తే తెలంగాణాకు నష్టం వాటిల్లుతుందని, అందువలన తెలంగాణా శాసనసభ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని కెసిఆర్ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles