Andhra pradesh does not fit in planning commission s special status norms

AP does not fit in special status norms, Planning Commission finds AP not fit for special status, Planning implementation Minister Rao Inderjit Singh, Central Minister Venkaiah Naidu discusses AP speacial status

Andhra Pradesh does not fit in Planning Commission's special status norms

11 రాష్ట్రాలకున్న ప్రత్యేకహోదా అర్హత ఆంధ్రాకి లేదు

Posted: 06/14/2014 11:46 AM IST
Andhra pradesh does not fit in planning commission s special status norms

ప్రణాళికా సంఘం ప్రమాణాల ప్రకారం ప్రత్యేక హోదాకు అర్హతలు గల రాష్ట్రాలు ఇవి- అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు.

ప్రత్యేక హోదాకి కావలసిన అర్హతలు-

1. రాష్ట్రం పర్వత ప్రాంతాలతో కూడి సమతలంగా లేక రాకపోకలకు కష్టసాధ్యమైన ఉపరితలంతో ఉండాలి.
2. జనాభా తక్కువ సాంద్రత కలిగివుండాలి.
3. జనాభాలో గిరిజనుల శాతం ఎక్కువగా ఉండాలి.
4. పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉండాలి
5. ఆర్థికంగానూ, మౌలిక సౌకర్యాల పరంగానూ వెనకబడివుండాలి.
6. రాష్ట్ర ఆదాయ వనరులు ఆధారపడదగ్గవిగా లేకుండా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ కి పై వాటిల్లో ఆఖరు అంశం తప్ప మరేదీ లేదు.  ప్రధాన ఆదాయ కేంద్రమైన హైద్రాబాద్ లేకపోవటంతో ఆదాయ వనరులు అంతగా లేవు.  

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన హామీ ప్రకారం ప్రత్యేక హోదా లభిస్తుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారవేత్తలతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు.  అందులో చాలామంది ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టటానికి సంసిద్ధతను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటించగానే బీహార్, రాజస్తాన్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కలిగించమని డిమాండ్ చెయ్యటం మొదలుపెట్టాయి.  కేంద్రప్రభుత్వానికి వాటి మీద నిర్ణయం తీసుకోవటం కూడా మిగిలివుంది.

గాడ్గిల్ ముఖర్జీ లు సూచించిన విధానం ప్రకారం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో కలిగే ఆర్థిక లాభాలు ఇవి-

1. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులలో 30 శాతం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు పోతుంది.  
2. సామాన్యంగా 30 శాతం గ్రాంట్, 70 శాతం ఋణంగా లభించే స్థానంలో ప్రత్యేక హోదాగల రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్, 10 శాతం ఋణంగా లభిస్తుంది.

దీని వలన రాష్ట్రం త్వరగా ఆర్థికంగా పుంజుకోవటానికి అవకాశం ఉంటుంది.

అయితే దీనిమీద ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు.  ఈ విషయంలో రాజ్య సభలో పట్టుపట్టిన వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రణాళిక అమలు మంత్రి రావ్ ఇందర్ జిత్ సింగ్ తో సమావేశమయ్యారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles