Final pay revision recommendations handed over to states by governor

Final pay revision recommendations of AP and TG, PRC handed over to States by Governor, PK Agarwal Committee on pay revision

Final pay revision recommendations handed over to States by Governor

మీ ఉద్యోగుల జీతాలు మీ ఇష్టం- గవర్నర్

Posted: 06/14/2014 10:37 AM IST
Final pay revision recommendations handed over to states by governor

ప్రభుత్వోద్యోగుల జీతాల పెంపు మీద పి.కె.అగర్వాల్ కమిటీ మే నెలలోనే ఫైనల్ పే రివిజన్ కమిషన్ నివేదికను సమర్పించటం జరిగింది.  జీతాల పెంపు కోసం కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు విడివిడిగా చేసిన సూచనలను అప్పటికింకా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడకపోవటంతో గవర్నర్ కి అందించటం జరిగింది.  

రాజ్ భవన్ లో ఉన్న ఆ దస్త్రాలను గవర్నర్ శుక్రవారం నాడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసారు.  శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు, తెలంగాణా ప్రధాన కార్యదర్శి రాజీవ్ అగర్వాల్ రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసినపుడు కమిటీ సూచనలను గవర్నర్ వారికి అందజేస్తూ, ఇక వాటి మీద నిర్ణయాలు తీసుకోవలసింది మీ రాష్ట్ర ప్రభుత్వాలే అని అన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడకముందు సంయుక్త రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండటం వలన రాష్ట్రపతి అప్పగించిన అధికారాలతో గవర్నర్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వహించారు.  కానీ దీర్ఘ కాలిక ప్రభావాన్ని చూపే పే రివిజన్ లాంటి నిర్ణయాలను ఆయన రాబోయే ప్రభుత్వాలు చూసుకుంటాయని వాటిని పక్కకు పెట్టేసారు.  ఇప్పుడిక ఇరు రాష్ట్రాలలోను ప్రభుత్వాలు ఏర్పడంతో ఆయన కమిటీ సూచనలను సంబంధిత రాష్ట్ర అధికారులకు అప్పగించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles