Bsp demands dismissal of up govt stages walkout in rajya sabha

BSP demands dismissal of UP govt, Samajwadi Party, BSP chief Mayawati, Samajwadi Party government in Uttar Pradesh, Akhilesh Yadav government, Badaun case, BSP demands to dissolve UP govt,

BSP demands dismissal of UP govt-stages walkout in Rajya Sabha

ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయండి? మాయావతి

Posted: 06/10/2014 03:55 PM IST
Bsp demands dismissal of up govt stages walkout in rajya sabha

బిఎస్సీ అధినేత్రి మాయావతి రాజ్యసభలో పెను దుమారం రేపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో రెండు పార్టీల సభ్యుల మద్య వాగ్వాదం చెలరేగింది. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి పారేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సహా పలువురు గట్టిగా డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందన్న అంశం రాజ్యసభలో పెను దుమారాన్ని రేకెత్తించింది. రాజ్యసభలో 14 మంది సభ్యులున్న బీఎస్పీ.. బదయూలో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై అత్యాచారం, హత్య సంఘటన విషయమై నాటి సభలో ఒక్కసారిగా మండిపడింది.

బదయూ లోక్ సభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సమీప బంధువు ధర్మేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యూపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని, అఖిలేష్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని మాయావతి డిమాండ్ చేశారు.

సీబీఐతో విచారణ జరిపించాలన్న తన హామీని కూడా ముఖ్యమంత్రి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో బీఎస్పీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి యూపీ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఎస్పీ ఎంపీలు వాకౌట్ చేయడంతో సభ సజావుగా సాగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles