First meet of sit on black money

First meet of SIT on Black Money, SIT under chairman ship of Justice MB Shah, SIT vice chairman Justice Pasayat, SIT appointed by Modi Govt

First meet of SIT on Black Money

నల్లధనం పై సిట్ తొలి సమావేశం

Posted: 06/02/2014 05:18 PM IST
First meet of sit on black money

దేశం లోని నల్ల ధనం మీద దర్యాప్తు చెయ్యటానికి సుప్రీం కోర్టు ఆదేశాలతో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈరోజు తొలి సమావేశం నిర్వహిస్తోంది.  

ఛైర్మన్ గా జస్టిస్ (రిటైర్డ్) ఎమ్ బి షా, వైస్ ఛైర్మన్ గా జస్టిస్ (రిటైర్డ్) అరిజిత్ పసాయత్ ల నేతృత్వంలో 11 దర్యాప్తు సంస్థలు, శాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో చర్చించవలసిన అంశాలు ఇవి- నల్లధనాన్ని శక్తివంతంగా నిలువరించటం ఎలా.  ఏయే విధానలతో ఆ పని చెయ్యవచ్చు.  ప్రస్తుతం నల్ల ధనం మీద జరుగుతున్న దర్యాప్తులు ఏయే దశల్లో ఉన్నాయి- వివరాలు, ఈ దిశగా వివిధ శాఖల సూచనలు.

ఈ సమావేశంలో పాల్గొంటున్న వివిధ శాఖలను వారి వారి సమగ్రమైన నివేదికలను తీసుకుని రావలసిందిగా సిట్ ఆదేశించింది.  వాటిని ఆయా శాఖల వారు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లకు ఈ సమావేశంలో విశదీకరించవలసివుంటుంది.
మొత్తానికి రథం కదిలింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles