Kcr receives guard of honor from police as cm

KCR receives guard of honor from police as CM, KCR watches police parade, Telangana movement remains in history kcr says, KCR first speech as Telangana CM

KCR receives guard of honor from police as CM

పరేడ్ గ్రౌండ్ లో కెసిఆర్ కి గౌరవ వందనం

Posted: 06/02/2014 12:06 PM IST
Kcr receives guard of honor from police as cm

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కె చంద్రశేఖరరావు తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఆ తర్వాత పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.  పోలీసులు జాతీయ పతాకానికి వందనాలు సమర్పిస్తూ కవాతును నిర్వహించారు. 

ఆ తర్వాత తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలి ప్రసంగాన్ని చేసారు.  

తెలంగాణా ఉద్యమం వలనే తెలంగాణా ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, అది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే ఉద్యమమని అన్నారు.  తెలంగాణా ఏర్పాటు ఒక మధురమైన ఘట్టమని కెసిఆర్ అన్నారు.  ఇది తెలంగాణా ఉద్యమాల విజయమని, అమరవీరుల త్యాగఫలమని కూడా ఆయన అన్నారు.  సకల జనుల సమ్మెను గుర్తు చేస్తూ అది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమమని కెసిఆర్ అభివర్ణించారు.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా ప్రత్యేక తెలంగాణా ఇంక్రిమెంట్లు ప్రకటించారు.  

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ గురించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలే కేంద్రబిందువుగా పాలన సాగుతుందని మాటిచ్చారు.  రాజకీయ అవినీతికి చరమగీతం పాడతామని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles