Chandrababu swearing in ceremony at mangalagiri

Chandrababu swearing in ceremony at Mangalagiri, Capital city to come up at Mangalagiri, Mangalagiri in the vicinity of Vijayawada and Guntur

Chandrababu swearing in ceremony at Mangalagiri

రాబోయే రాజధాని ప్రాంతంలో బాబు ప్రమాణ స్వీకారం

Posted: 06/02/2014 12:49 PM IST
Chandrababu swearing in ceremony at mangalagiri

తన ప్రమాణ స్వీకారం ఎక్కడన్నది త్వరలో చెప్తానంటూ చెప్పుకొస్తున్న చంద్రబాబు నాయుడు చివరకు మంగళగిరి శివార్లలో జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.  

మంగళగిరి దగ్గర 5000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం గుర్తించటం జరిగింది.  విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లకు సమీపంలోను, నేషనల్ హై వే 5, 9 కలుస్తున్న మంగళగిరి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని గడ్డ కాబోతోంది.  అక్కడ కావలసినంత నీరు, గన్నవరం విమానాశ్రయానికి కూడా చేరువలో ఉండటం వలన రాజధానికి తగిన ప్రదేశంగా భావించటం జరుగుతోంది.  జూన్ 8 న ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడి నుండే తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నడపబోతున్నారు. 

గన్నవరం విమానాశ్రయం దగ్గర బాపులపాడు ఒక చిన్న నగరాన్ని నిర్మించటానికి 12000 ఎకరాల భూమిని కూడా గుర్తించటం జరిగిందని ఒక ప్రభుత్వాధికారి తెలియజేసారు.  

కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం అందవలసిన విధంగా అందలేదు.  మామూలుగా అందరికీ పంపించినట్లే పంపించారు కానీ ఒక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని ఆహ్వానించే విధంగా జరగలేదు.  కానీ చంద్రబాబు మాత్రం తన ప్రమాణ స్వీకారానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి సక్రమమైన పద్ధతిలో సగౌరవంగా ఆహ్వానం పంపిద్దామని అనుకుంటున్నట్లుగా సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles