Modi asks cabinet ministers to make a 100 days plan

Modi asks cabinet ministers to make a 100 days plan, Prime Minister Narendra Modi initiates Ministers to work, Modi gives directives to Ministers for success

Modi asks cabinet ministers to make a 100 days plan

మోదీ విజయరహస్యాలలో ఒకటి బయటపడింది

Posted: 05/29/2014 04:16 PM IST
Modi asks cabinet ministers to make a 100 days plan

మోదీ పని చెయ్యటమే కాదు చేయించగలరు కూడా!  నాయకుడు వ్యక్తిగతంగా ఎంత పని చెయ్యగలడు?  పోనీ అలా అని ఆదర్శవంతంగా నిలవవలసిన నాయుకుడు పనే చెయ్యకపోతే మిగతావారికి స్పూర్తిదాయకంగా ఉండలేకపోతాడు!  అందువలన సమర్థవంతుడైన నాయకుడు తాను పనిచెయ్యాలి, ఆ ఆదర్శంతో మిగిలినవాళ్ళు కూడా పనిచేసేట్టుగా చెయ్యగలగాలి!  అటువంటి నాయకత్వ లక్షణాలున్న ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ పగ్గాలందుకుని మూడురోజులే అయినా ఎంతో పని చేసి చూపించారు. కేబినెట్ మీటింగ్, అత్యవసరమైన దస్త్రాలను చూడటం, ప్రధాన మంత్రి కార్యాలయంలో అందరినీ పరిచయం చేసుకోవటం జరిగింది.  మరో పక్క ట్విట్టర్, ఫేస్ బుక్, తనకి అభినందనలను తెలిపినవారికి కృతజ్ఞతలు తెలియజేయటం, పార్టీలోను, మిత్రపక్షాలలోను అందరినీ కలుపుకుపోవటం ఇవన్నీ చేస్తూనే కేబినెట్ మంత్రివర్గానికి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు.

మనసులోనే ఆలోచిస్తే ఎంతకూ తేలదు.  ఎంత చేసినా తృప్తి ఉండదు,  అందుకు కారణం- చేసే పనులు క్రమబద్ధంగా లేకపోవటం.  అందువలన నరేంద్ర మోదీ తన విజయరహస్యాలలో ఒకదాన్ని తనతో పనిచేస్తున్న మంత్రులకూ అందించారు.  అదేమిటంటే వంద రోజుల ప్రణాళిక వేసుకోవటం! 

ప్రస్తుతం ఉన్న సందర్భాలను కూలంకషంగా పరిశీలించి, చెయ్యదలచుకున్న పనిని ప్రణాలికగా వేసుకుని, వాటిని వందరోజులలో పూర్తి చేసేట్టుగా సంకల్పించుకోవటం.  ప్రణాళిక ఎప్పుడైతే అక్షర రూపం దాలుస్తుందో అప్పడవి మార్గదర్శకాలవుతాయి.  వాటిని ఎంత వరకు పూర్తి చెయ్యగలిగామన్నది ఎప్పిటికప్పుడు సరిచూసుకుని వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.  దీన్నే పెర్ట్ ఛార్ట్ అంటారు.  మనం చెయ్యదలచుకున్న పనిని ప్రణాళికాబద్ధం చేసినట్లయితే వాటితో ఏరోజుకారోజు పూర్తి చేసిన పనిత పోల్చి చూసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేసి అనుకున్న సమయంలో అవగొట్టటం సాధ్యమౌతుంది.

దానితో పాటుగా ప్రణాళికలో ముందు ఇచ్చిన హామీల ఆచరణ, సమర్థ పాలన, రాష్ట్రాలలోని సమస్యల మీద ప్రధానంగా దృష్టి పెట్టటంలాంటి వి కూడా ప్రధానమంత్రి తన మంత్రి వర్గ సభ్యులకు సూచించారు.   

అధికారం రాగానే ఏదో గబుక్కున చూపించటానికి చెయ్యటం కాకుండా, ఐదు సంవత్సరాలు ఉన్నాయిలే అని తీరిగ్గానూ కూర్చోకుండా కార్యాలను మొదలుపెట్టి ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్ళటం అనేది ప్రభుత్వానికి చాలా అవసరం.  ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే గబగబా ఏవేవో పనులు చేసి, గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, మరేదో చెయ్యాలనుకుని ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా దిగిపోవటం చేసిన ఆఆపా కేజ్రీవాల్ లా కాకుండా, మోదీ చేపట్టే పనుల్లో సమర్థత కనిపిస్తోంది. 

సముచిత వేగం సరైన విధానం! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles