Oath taking of chandrababu naidu

Oath taking of Chandrababu Naidu, Chandrababu swearing in time undecided, Swearing in of Chandrababu to be decided

Oath taking of Chandrababu Naidu

బాబు పగ్గాలు చేపట్టేది ఎప్పుడు?

Posted: 05/29/2014 03:06 PM IST
Oath taking of chandrababu naidu

ప్రమాణ స్వీకారం చేస్తేకానీ అధికారంలోకి వచ్చినట్లు కాదు, అధికారంలోకి వస్తేనే కానీ రాష్ట్రాన్ని నడిపించటం కుదురదు కనుక తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రమాణస్వీకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలను ఎప్పుడు చేపడతారా అని కుదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది.  

మహానాడులో ఎనిమిదవ తేదీ ఉదయం 11.45 కి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించిన చంద్రబాబు తిరిగి ముహూర్తం విషయంలో ఆలోచనలో పడ్డట్టుగా కనిపిస్తున్నారు.  అదే రోజు అంతకన్నా మంచి ముహూర్తమున్నదని కొందరు అభిప్రాయపడటం చంద్రబాబు ని సందిగ్ధంలో పడేసింది.  ఈ విషయంలో చర్చించటానికి చంద్రబాబు ఈరోజు తన నివాసంలో కృష్ణా గుంటూరు నాయకులతో భేటీ అయ్యారు.  

ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిపించి ఎన్నికలలో చేసిన హామీలు, చెయ్యనివి కూడా పూర్తిచేసి తన సత్తా చూపిద్దమనుకుంటున్న చంద్రబాబు అందుకు మానవీయ శక్తులను ఎదురించి పోరాడటానికి సిద్ధంగానే ఉన్నారు కానీ, మానవాతీతమైన గ్రహబలాల విషయంలోను వాస్తు విషయంలోనూ రాజీపడదలచుకోలేదు.  అందుకే సచివాలయంలో హెచ్ బ్లాక్ లో రూపుదిద్దుకుంటున్న సిఎం కార్యాలయాన్ని పిండరూపంలో ఉండగానే నిలిపివేసి ఎల్ బ్లాక్ లో నిర్మాణానికి సై అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles