Modi and nawaz sharif met on tuesday

Modi and Nawaz Sharif met on Tuesday, Nawaz Sharif says brought peace message, Nawaz Sharif for good relations with India

Modi and Nawaz Sharif met on Tuesday

మోదీ షరీఫ్ ల భేటీ

Posted: 05/27/2014 03:56 PM IST
Modi and nawaz sharif met on tuesday

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో కలిసి మాట్లాడారు.   ఈ భేటీలో మోదీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ కూడా ఉన్నారు.  

మోదీ ప్రమాణ స్వీకారానికి ఆయన ఆహ్వానం మీద నవాజ్ షరీఫ్ ఢిల్లీ రాక మీద ఇరు దేశాలలోను, ఆహ్వానించినందుకు మోదీని ఆ ఆహ్వానాన్ని మన్నించినందుకు నవాజ్ షరీఫ్ ని విమర్శించారు.  కానీ ఇరు దేశ ప్రధానులు కలిసి మాట్లాడుకోవటం రెండు దేశాల మధ్య రగులుతూ వస్తున్న ఉద్రిక్తలకు కళ్ళెం వేస్తుందనే నమ్మకం ఏర్పడుతోంది.  

అయితే ఈ భేటీలో పెద్దగా కంటికి కనిపించే మార్పులేమీ జరగలేదు కానీ సోమవారం మాత్రం నవాజ్ షరీఫ్ తాను శాంతి సందేశాన్ని తీసుకుని వచ్చానని, 1999 లో అటల్ బిహారీ వాజ్ పాయ్ హయాంలో ఆగిపోయిన సూత్రాన్ని మరోసారి తిరిగి పట్టుకునే ప్రయత్నం చేద్దామని అన్నారు.  రెండు దేశాల ప్రభుత్వాలకూ ఇప్పుడు కొత్తగా తమ హామీలను నెరవేర్చుకునే సందర్భం వచ్చిందని, అందువలన పరస్పర సంబంధాలలో కొత్త శకానికి తెరలేవబోతున్నదని నవాజ్ షరీఫ్ అన్నారు.

నిర్ణయాలేమీ తీసుకోకపోయినా, దీర్ఘకాలంగా వస్తూవున్న ఇరు దేశాల మధ్య నలుగుతున్న తగవుల పరిష్కారం చేసుకోవటంలో ఆలోచన చెయ్యాలని అంగీకరించారు.  ఉగ్రవాద చర్యల విషయంలోను, పాకిస్తాన్ లో జరుగుతున్న 2008 ముంబై దాడి విషయంలో జరుగుతున్న జాప్యం విషయంలోను మోదీ తన అసంతృప్తిని వెలిబుచ్చారు. 

ఈరోజు తిరిగి వెళ్ళిపోబోతున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి త్వరలోనే ఏదో ఒక సందర్భంగా నరేంద్ర మోదీని కూడా తమ దేశానికి ఆహ్వానించవచ్చని సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles