Unknown side of pawan kalyan

Pawan Kalyan Unknown side, Pawan Kalyan Janasena party, Pawan Kalyan politican entry, Pawan Kalyan virtues

Unknown side of Pawan Kalyan

పవన్ కళ్యాణ్ లో అందరికీ తెలియని కోణం !

Posted: 05/28/2014 01:33 PM IST
Unknown side of pawan kalyan

మనం కొందరిని చూసి కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం.  కానీ అవి సరైనవి కావొచ్చు, కాకపోవచ్చు, మనం ఊహించుకున్నదానికంటే ఎక్కువ మంచివారైయ్యుండవచ్చు, లేదా మన అంచనాలను తలకిందులు చేసేవారూ కావొచ్చు.  మనుషులలో అంతర్గతంగా ఉండే గుణాలు ఆయా సందర్భాలలోనే బయటపడతాయి.  పైకి అందరం మంచివారిలాగానే కనిపిస్తాం.  అంతా సవ్యంగా నడుస్తున్నంత కాలం అందరం మంచివాళ్లమే.  కానీ అనుకోని సందర్భాలలో మన ప్రవర్తనే, మనం తీసుకునే చర్యే, మన స్పందనే మన అసలు నైజాన్ని, మన నిజస్వరూపాన్ని తెలియజేస్తుందన్నది ఈ చిన్న సంఘటనతో తేటతెల్లమౌతుంది.  

దీన్నే విన్ సాప్ట్ సిఇఓ, హృదయ ఫౌండేషన్ సభ్యుడైన జయదేవ్ మాటల్లో చెప్పాలంటే-

"నేను లాస్ ఏంజెలెస్ కి తిరిగిపోతున్న సందర్భంలో హైద్రాబాద్ దుబాయ్ ఫ్లైట్ లో వెళ్తూ ఎప్పటిలాగానే ప్లేన్ లోకి చిట్టచివరి వాళ్ళతో ఎక్కాను.  ఫస్ట్ క్లాస్ లో రెండే వరుసలుండటం వలన సామాన్లు పెట్టుకునే బిన్ లన్నీ నిండిపోయున్నాయి.  నా ముందు ఒక పెద్దమనిషి తన సామాన్లు పెట్టుకోవటానికి స్థలం లేకపోవటంతో చిరాకు పడుతున్నారు.  అప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి ఆయన దగ్గరున్న బరువైన బ్యాగ్ ని తీసుకుని కోట్ బిన్ లో పెట్టింది.  ఇక నా వంతు వచ్చింది.  నేనూ నా సామాన్లను ఎయిర్ హోస్టెస్ కి ఇవ్వబోతున్నాను.  

"ఇంతలో నా వెనక ఒకతను రెండు రోలర్ బ్యాగ్ లను తీసుకుని వచ్చున్నారు.  ఆయన తన బ్యాగ్ లను స్వయంగా కోట్ బిన్ లో పెట్టుకోవటం చూసిన నేను నా సామాన్లను ఎయిర్ హోస్టెస్ చేతికి ఇవ్వటానికి చూడటం నాకే ఎలాగో అనిపించింది.  దానితో నేను నా బ్యాగ్ ని ఎత్తి కోట్ బిన్ లో పెట్టబోయాను.  కానీ కోట్ బిన్ కి దగ్గర్లో ఉన్న అతను తన రెండు బ్యాగ్ లను పెట్టటమే కాకుండా నా బ్యాగ్ ని కూడా తీసుకోవటానికి చెయి చాపారు.  

"ఆయనను చూడగానే గుర్తుకొచ్చింది-  

"ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు.  మోదీ అఖండవిజయంలో ఎటువంటి పాత్రా లేని అమితాభ్ బచ్చన్, రజనీ కాంత్, సల్మాన్ ఖాన్ లు ఆ వేడుకకు హాజరవుతున్నారు కానీ, రాజకీయాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అతి ముఖ్యమైన పాత్రను పోషించి కూడా రాజకీయాలలో కేంద్ర బిందువై ప్రాముఖ్యతను సంతరించుకోవటం ఇష్టం లేక తన కుటుంబ సభ్యులతో ప్యారిస్ లో గడపటానికి పోతున్నారీ ప్రఖ్యాత నటుడు.   

"మీమీద నా గౌరవాభిమానాలు ఇంకా పెరిగాయి పవన్ కళ్యాణ్!  హాట్స్ ఆఫ్ టు యు!"

దీన్ని జయదేవ్ తన ఫేస్ బుక్ లో పెట్టారు.  

తెలుగు సినిమా పరిశ్రమలో నంబర్ ఒన్ గాను, భారతీయ సినీ రంగంలో నంబర్ 4 సినీ హీరో గాను పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, అదంతా పక్కన పెట్టి, రాజకీయ పార్టీ పెట్టి, అందులోనూ ఎటువంటి అధికారాన్ని ఆశించకుండా, కేవలం మంచివాళ్ళని గెలిపించేందుకే శ్రమించి, రాజకీయాలకో కొత్త నిర్వచనమిచ్చారు.  కానీ, లాభాపేక్షతోనే రాజకీయల్లో ఉన్నవాళ్ళకి అర్థం కాకుండా పోయారు.  "నాకు తిక్కుంది..." అన్న సినిమా డైలాగ్ నిజమేనేమో అనేట్టుగా ఉంది ఆయన ప్రవర్తన వాళ్ళందరికీ! 

అది అర్థం కానివాళ్ళకి, ప్లేన్ లో ఫస్ట్ క్లాస్ లో ప్యారిస్ పోతున్నంత మాత్రాన నేనో ప్రత్యేకతను సంతరించుకోనక్కర్లేదు అన్నట్లుగా ప్రవర్తించిన పవన్ కళ్యాణ్ తీరు చూస్తేనైనా, కొంతైనా ఆయన గురించి అర్థమౌతుందేమో అలాంటి వాళ్ళకి.   

ఈ సుభాషితం గుర్తు రావటం లేదూ!

म्रुदुलं नवनीतमीरितं नवनीतादपि सज्जनस्य ह्रुत् |

तदिदं द्रवति स्वतापनात् परतापाद्र्वते सतां पुन: ||

सुभाषित सुरद्रुमा

Mrudulam navaneeta meeritam, navaneetaa dapi sajjanasya hrut
tadida dravati svata panaath, parataa paadravate sataam punaha

Subhashita Suradruma

Butter is considered as super soft. But noble man's heart is more softer.
Butter melts when the temperature raises for itself.
But noble man's heart melt even when temperature raises for others

Meaning: A noble man worries for others problem also

-శ్రీజ

జయదేవ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన సందేశం-
(జయదేవ్ నందమూరి బాలకృష్ణ కుటుంబానికి సన్నిహితులు.  బెంగళూరులో ఇంజినీరింగ్ చేసి అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న జయదేవ్ లాస్ ఏంజెలెస్ లో నివాసముంటూ అక్కడ పేరొందిన, రాణించిన తెలుగువారిలో ఒకరు.)

jayadev-fb

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles