Bjp cabinet ministers 2014

Narendra Modi takes oath as 15th PM of India, bjp cabinet ministers 2014, Narendra Modi takes oath as 15th PM of India, bjp cabinet ministers,

Narendra Modi takes oath as 15th PM of India, bjp cabinet ministers 2014

మోడీ సభలో మంత్రులు వీరే

Posted: 05/26/2014 07:56 PM IST
Bjp cabinet ministers 2014

ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణస్వీకారం చేశారు. 

1) రాజ్ నాథ్ సింగ్ తొలి సారి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

2) వాజ్ పేయి ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన సుష్మాస్వరాజ్, మరోసారి కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.

3) గతంలో న్యాయశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన అరుణ్ జైట్లీ, మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

4) గతంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడు, మరోసారి కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు.

5) మహారాష్ట్రలోని రాష్ట్ర మంత్రి వర్గంలో పదవులు నిర్వహించిన నితిన్ గడ్కరీ, తొలిసారి కేంద్ర మంత్రిగా పమాణస్వీకారం చేశారు.

6) కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానందగౌడ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

7) మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి కేంద్రమంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమె గతంలో మంత్రిగా పని చేశారు.

8) రాజ్యసభ మాజీ స్పీకర్ నజ్మా అక్బరల్ హెప్తుల్లా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అధ్యక్షురాలుగా ఈమె పనిచేశారు.

9) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గోపీనాథ్ రావు ముండే తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

10) రాంవిలాస్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన గతంలో కేంద్రమంత్రిగా పలుపదవీ బాధ్యతలు నిర్వహించారు.

11 మున్నా భయ్యాగా అభిమానుల్లో గుర్తింపు పొందిన నరేంద్ర సింగ్ తోమర్ తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

12 గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన జ్యూల్ ఓరమ్ మరోసారి కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

13. రాధా మోహన్ సింగ్ కేంద్ర మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు.

14 సావర్చన్ గెహ్లాట్ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

15 సినీ నటి స్మృతీ జుబిన్ ఇరానీ తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె గతంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేశారు. రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

16. ఢిల్లీ మాజీ మంత్రి, తాజాగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన హర్షవర్థన్ తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

17 టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో పలు మంత్రి పదవులు సమర్థవంతంగా నిర్వహించిన అశోక్ గజపతి రాజు తొలిసారి కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

18. శర్వానంద్ సానో వాల్ తొలిసారిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన ఆయన బీజేపీలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు.

19 ప్రకాశ్ జవదేకర్ తొలిసారిగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజసభ సభ్యుడైన జవదేకర్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన గతంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

20 రాజ్యసభ సభ్యుడైన పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ జాతీయ కోశాధికారిగా ఉన్న గోయల్ కు 27 ఏళ్ల అపార రాజకీయ అనుభవం ఉంది.

21. జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన జమ్మూ కాశ్మీర్ లో భారతీయ జనతాపార్టీలో కీలక నేత.

22 నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె ఇంతకుముందు జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు.

23. గౌడర్ మల్లికార్జునప్ప సిద్ధేశ్వర కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరుసగా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.

24. మనోజ్ సిన్హా కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిన్హా మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.


సహాయ మంత్రులు :
నేహాల్ చంద్, ఉపేంద్ర కుష్వాహా, సి.వి. రాధాకృష్ణన్, కిరెన్ రిజిజు, క్రిషన్ పాల్ గుజర్, సంజీవ్ కుమార్, వాసన మన్సుక్ భాయ్, ధనాజీభాయ్, రావు సాహెబ్ దాదారావ్ పటేల్ ధాన్వే, విష్ణుదేవ్ సాయి, సుదర్శన్ భగత్ కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles