Strike by electricity employees for prc release

Strike by Electricity employees, Elec Employees demand PRC release, Governor Narasimhan agrees 27.5 percent IR, Elec Empoloyees demand 30 percent IR

Strike by Electricity employees for PRC release

విద్యుతుద్యోగుల మెరుపు సమ్మెతో ఉడుకెత్తిన రాష్ట్రం

Posted: 05/26/2014 10:51 AM IST
Strike by electricity employees for prc release

విద్యుతుద్యోగలు ఆదివారం చేసిన మెరుపు సమ్మెతో అసలే ఎండాకాలం వేడితో బాధపడుతున్న రాష్ట్రవాసులకు పెనం మీదినుంచి ఏకంగా కుంపట్లోకి పోయినట్లే అయింది.  

విద్యుతుద్యోగులు పిఆర్ సి ని తక్షణం అమలు చెయ్యాలని కోరుతూ ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు.  ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆదివారం అర్థరాత్రి వరకు చేసిన సంప్రదింపులు విఫలమయ్యాయి.  పిఆర్ సి ని ఇవ్వలేని పక్షంలో మధ్యంతర భృతిని విడుదల చెయ్యాలని విద్యుత్ ఐకాస పట్టుబట్టటంతో ట్రాన్స్ కో సిఎండీ సురేశ్ చందా, జెన్ కో ఎండీ విజయానంద్ గవర్నర్ ని సంప్రదించారు.  వేతన సవరణలో భాగంగా ఉద్యోగులకు27.5% మధ్యంతర భృతిగా విడుదల చెయ్యాలని గవర్నర నరసింహన్ నిర్ణయించారు.  ఈ విషయాన్ని జెఎసి కి చేరవేయగా, వాళ్ళు కనీసం 30% మధ్యంతర భృతిని విడుదల చెయ్యాలని, లేదంటే సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.  

ఈరోజు ఉదయం 11.00 గంటలకు మరోసారి చర్చలు జరుగనున్నాయి.  

అయితే రాష్ట్రపతి పాలనలో ఉన్న సందర్భంగా సమ్మెలు సరికాదని, రాష్ట్రపతి వరకు వెళ్ళి కేసులలో చిక్కుకున్నట్లయితే పరిస్థితి బాగుండదని కొందరు సూచిస్తూ సమ్మెను విరమిద్దామని కూడా అనుకుంటున్నారు.  

ఈ లోపులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ సమ్మె విరమించవలసిందిగా ఉద్యోగ సంఘాలను కోరారు.  

వేతన సవరణ ఏప్రిల్  నుంచే అమలు లో ఉంటుందని, ఆ విషయంలో ఆదుర్దా పడవలసిన అవసరం లేదని, ప్రధాన కార్యదర్శి పి కె మొహంతి అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles