Trs starts war room to keep state employees from seemandhra out

TRS starts war, TRS starts war room, trs party, telangana state, telangana employees, trs leaders, employees from Seemandhra out, RS chief and CM-designate K Chandrasekhar Rao.

TRS starts war room to keep state employees from Seemandhra out

మొదలైన టీఆర్ఎస్ ‘వార్’

Posted: 05/26/2014 10:29 AM IST
Trs starts war room to keep state employees from seemandhra out

ఇక తెలంగాణ రాష్ట్రంలోమొదలైన టీఆర్ఎస్ వార్ . ఉద్యోగుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన వార్ రూమ్ తో పాటు ప్రత్యర్థులపై కూడా యుద్ధం ప్రారంభమైంది. ఉద్యోగుల విభజన అంశాలపై దృష్టి సారించిన టిఆర్ఎస్ వాటి పరిష్కారం కోసం వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. సీనియర్ నేత హరీష్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లతో పాటు పదిమంది ఎమ్మెల్యేలు ఈ వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండో తేదీకి వ్యవధి ఎక్కువగా లేకపోవడంతో సీమాంధ్రకు చెందిన ఉద్యోగుల వివరాలను యుద్ద ప్రాతిపదికన పంపించేందుకు trswarroom.com వెబ్ సైట్ ను ప్రారంభించారు. This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. మెయిల్ ను స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ లు ప్రారంభించారు. ఉద్యోగుల వివరాలు తప్పుల తడకలా ఉన్నాయని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఆరోపించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రారంభించిన వార్ రూమ్, ఏర్పాటుతోనే యుద్ధ వాతావరాణాన్ని నెలకొల్పింది. వార్ రూమ్ ఏర్పాటు చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను టిఆర్ఎస్ నేతలు ఖండించారు.

వార్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు కూడా దాటకముందే మూడు వేల మంది ఉద్యోగులకు సంబంధించిన సమాచారం వచ్చినట్లు నేతలు తెలిపారు. తెలంగాణలో అక్రమంగా పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతంలో పనిచేయాలంటున్న తాము…సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను కూడా ఇక్కడకు రప్పించుకుంటామని టీఆర్ఎస్ నేతలు తెలిపారు.  ప్రారంభంలోనే హాట్ హాట్ గా మారిన వార్ రూమ్ భవిష్యత్ లో ఇది ఎలాంటి కార్యక్రమాలకు వేదికౌతుందో చూడాలి..

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles