Modi takes blessings from seniors and deity balaji

Modi takes blessings from seniors and deity Balaji, Narendra Modi oath taking, Modi felicitated by TTD, TDP President Chandrababu Naidu

Modi takes blessings from seniors and deity Balaji

మోదీకి పెద్దలు, దైవం ఆశీర్వాదం!

Posted: 05/26/2014 09:11 AM IST
Modi takes blessings from seniors and deity balaji

ఈరోజు సాయంత్రం 6.00 గంటలకు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యనున్న సందర్భంగా ఆయన ముందుగా ఢిల్లీ లోని రాజ్ ఘాట్ కి వెళ్ళి మహాత్మునికి నివాళులర్పించారు.  ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో పితామహుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  

శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వాదబలం కూడా మోదీకి సమకూర్చటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జెఇవో శ్రీనివాసరాజు స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాలతో వేద పండితులతో, ఒఎస్డీ డాలర్ శేషాద్రితో ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.  అదే రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో మోదీకి సత్కారం, స్వామి అనుగ్రహం కోసం వేదపండితుల ఆశీర్వచన కార్యక్రమం జరిగింది.  

గతంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవెగౌడ కు కూడా చంద్రబాబు సలహా మేరకు తిరుపతి వేంకటేశ్వరుని ఆశీర్వచనం, తితిదే తరఫున సత్కారం జరిగింది.

తల వంచినంత మాత్రాన చిన్నవాడేమీ కాడన్న సూక్తిని పాటిస్తూ, అఖండ విజయం సాధించిన తర్వాత కూడా నరేంద్ర మోదీ రాష్ట్ర పిత, పార్టీ పెద్దల ఆశీర్వాదం, దైవబలం కోసం తలవొగ్గుతూ వినయభూషణుడిగా ప్రవర్తిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles