Tight security for modi oath taking cermony

Tight security for Modi oath taking cermony, Narendra Modi Oath taking, Nawaz Sharif attends Modi oath taking, Mahinda Rajpaksa attends Modi oath taking, heavy security to foreign delegates

Tight security for Modi oath taking cermony

మోదీ ప్రమాణ స్వీకారానికి రిపబ్లిక్ డే తో సమానమైన భద్రతా ఏర్పాట్లు

Posted: 05/26/2014 09:40 AM IST
Tight security for modi oath taking cermony

ఈరోజు సాయంత్రం 6.00 గంటలకు నరేంద్ర దామోదరదాస్ మోదీ రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు.  గణతంత్ర దినాన జరిగే భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రాష్ట్రపతి భవన్, ఇతర ప్రాంతాలలో గట్టి బందోబస్తు చెయ్యటానికి కారణం పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహింతా రాజ్పక్సా ల రాక.  

modi-oathtaking-cermony

ఇతర దేశాలకు చెందిన అగ్రనాయకులు బస చేస్తున్న హోటళ్ళు, రాష్ట్రపతి భవన్ కి భద్రతా ఏర్పాట్లు చెయ్యటానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఢిల్లీ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కలిసి 10000 మంది వరకు నడుం బిగించారు.  రాష్ట్రపతి భవన్ నార్త్ సౌత్ బ్లాక్ లోని కార్యాలయాలను ఈ రోజు మధ్యాహ్నం 1.00 గంటల నుంచి మూసివేయనున్నారు.  

విఐపిలు రాష్ట్రపతి భవన్ కి చేరుకునే సమయం కాబట్టి సాయంత్రం అయేసరికి ఢిల్లీ రోడ్లలో ట్రాఫిక్ నిబంధనలతో చాలా వరకు రాకపోకలు నిలిచిపోనున్నాయి.  మన భద్రతా దళాలే కాకుండా నవాజ్ షరీఫ్, మహిందా రాజ్పక్సాల భద్రతా సిబ్బంది కూడా వారి వెంటవస్తున్నారు.  

ఇవన్నీ కాకుండా నిఘాసంస్థల నుంచి వచ్చిన సమాచారం, సూచనల మేరకు ఉగ్రవాదుల నుండి భద్రతా ప్రమాదం ఉన్న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీ భద్రతకు కూడా 5000 మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles