Nitish resignation final sharad yadav says

Nitish resignation final Sharad Yadav says, Resignations high drama necessity, Sharad Yadav confirms Nitish Kumar resignation

Nitish resignation final Sharad Yadav says

రాజీనామా హైడ్రామాలూ అవసరమే?

Posted: 05/19/2014 03:18 PM IST
Nitish resignation final sharad yadav says

సీన్ 1- పరీక్షల్లో తప్పిన విద్యార్థిని ఇంట్లో అందరూ విమర్శిస్తుంటారు.  సరిగ్గా చదువుకోకుండా జులాయిగా తిరిగినందుకు ఫలితమే ఇది అని తూలనాడుతారు.  అతని స్నేహితులలో ఎవరెవరు పాసయ్యారో వాళ్ళతో పోల్చి మరీ తిడతారు.  అతని స్నేహితులు కూడా ఫెయిలయినట్లయితే, అలాంటి వాళ్ళతో స్నేహమే ఇంతకు తెచ్చిందని అప్పుడూ తిడతారు.  

సీన్ 2- పరీక్ష తప్పిన విద్యార్థి తల వేల్లాడేసుకుని ఇంటికి వస్తాడు.  ఎవరితో చెప్పకుండా తన గదిలోకి పోయి తలుపేసుకుంటాడు.  ఎవరు పిలిచినా పలకడు.  తలుపు తట్టినా తెరవడు.  చివరకు, తను బతికుండి ప్రయోజనమేంటి అంటాడు.  కుటుంబ సభ్యలు, మిత్రులు, బంధువులూ అందరూ అతన్ని సముదాయిస్తారు.  ఇంతటితో అంతా అయిపోయినట్టేనా, జీవితం ఎంతో విలువైంది, ఇంకా చాలా వుంది.  లైట్ గా తీసుకో అంటారు.

ప్రస్తుతం ఎన్నికలలో ఓడినవారి పరిస్థితి అలాగేవుంది.  రాజీనామా మంత్రం చాలా బాగా పనిచేస్తుంది.  ఎవరూ నిరసించకపోవటమే కాకుండా బుజ్జగించే ప్రయత్నం చెయ్యటానికి మరో కారణం కూడా ఉంటుంది.  అదేమిటంటే అతని మీద ఆధారపడ్డవారు కూడా రాజకీయాల్లో నష్టపోవటం జరుగుతుంది కాబట్టి.

రాష్ట్రంలో జెడి(యు) ఓటమికి నైతిక బాధ్యతను స్వీకరిస్తూ బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో హై డ్రామాకి తెరలేచింది.  ఆదివారం ఆయనతో సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఆయనను సముదాయించటానికి ప్రయత్నం చేసారు. 

అయితే, ఆ పార్టీ అధినేత శరద్ యాదవ్ మాత్రం లేదు, నితిశ్ రాజీనామా చేస్తారు.  అదే ఫైనల్ అంటూ ప్రకటించి ఆశ్చర్యపరచారు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles