Threat to modi from terrorist organizations

Threat to Modi from terrorist organizations, Student Islamic Movement of India slogans against Modi, SIMI Abu Faizal sloganeering against Modi, SIMI meets Indian Mujahideen, Modi considered as anti Islam by terrorist groups

Threat to Modi from terrorist organizations

మోదీకి ఉగ్రవాదుల నుండి ప్రమాదం

Posted: 05/19/2014 05:03 PM IST
Threat to modi from terrorist organizations

2014 ఎన్నికల్లో తుఫాన్ సృష్టించిన భారతీయ జనతా పార్టీకి నాయకుడిగా ఎంపికైన నరేంద్ర మోదీకి దేశ బాధ్యతలతో పాటుగా మరో సవాల్ ఎదురవుతోంది.  అది ఉగ్రవాదుల నుండి.  అందుకు సంకేతంగా రెండు రోజుల క్రితం మే 16న నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) విద్యార్థులను భోపాల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టటానికి తీసుకునిపోతుంటే, కోర్టు ఆవరణలో, అబ్ కి బార్ మోదీ కా నంబర్ అని, తాలిబాన్ జిందాబాద్ అని నినాదాలు చేసారు.  అదే సమయంలో ఢిల్లీలో మోదీకి స్వాగతం పలుకుతున్నప్పుడు అక్కడ కూడా అదే సమయంలో అవే నినాదాలు వినిపించాయి. 

భోపాల్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం 18 మంది సిమి కార్యకర్తలు, వాళ్ళ మధ్యప్రదేశ్ నాయకుడు, ఉగ్రవాదచర్యలో నిందితుడు అబు ఫైజల్ తాలిబాన్ అనుకూలంగానూ, మోదీకి ప్రతికూలంగానూ నినాదాలు చేసారు.  ఈ విషయం మీద స్పందించిన మధ్య ప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ మాట్లాడుతూ, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలలో చెలరేగుతున్న అలజడే ఇందుకు కారణమని, మోదీ అధికారాన్ని చేపట్టటాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారని, ఎందుకంటే ఉగ్రవాదుల పట్ల మోదీ ఉగ్రనారసింహుడేనని అన్నారు.  అయితే ఈసారి సిమి కార్యకర్తలు, నాయకులను జైల్లోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిస్తామని కూడా ఆయన అన్నారు.  

మధ్య ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నందన్ డుబే మాట్లాడుతూ, సిమి అన్నది బహిష్కరించిన ఉగ్రవాద సంస్థని, కోర్టు ఆవరణలో మీడియాను చూసేసరికి వారు పెచ్చు మీరిపోయారని అన్నారు.  

మోదీ ర్యాలీలకు ముందుగా ఆ ఉగ్రవాద సంస్థ రెక్కీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిసింది.  ఛత్తీస్ గఢ్ పోలీసుల ప్రకారం రాజ్ పూర్ లో ఉగ్రవాద శిక్షణా శిబిరంలో పనిచేస్తున్నప్పుడు సిమి నాయకుడు ఉమర్ సిద్దిక్వి ఇండియన్ ముజహిదీన్ సంస్థతో సంపర్కంలో ఉన్నారు.  పట్నాలో విఫలమైన తర్వాత ఇండియన్ ముజాహిదీన్ రాయ్ పూర్ లో మోదీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మరో సారి ప్రయత్నం చేసారు కానీ నిఘా వర్గాలు వాళ్ళ ప్రయత్నాలను వమ్ముచేసాయి.  

మోదీ ముస్లింలకు వ్యతిరేకనే భావన కలగటంతో సిమి సంస్థ ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసి ఉగ్రవాద ప్రణాళికలు వెయ్యటానికి అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.  ప్రస్తుతం భోపాల్ సెంట్రల్ జైల్ లో ఉన్న డాక్టర్ గా పిలవడుతున్న ఫైజల్ ఇందోర్ లో హోమియోపతి కోర్స్ చేసినవాడు.  సిమి సంస్థలో సఫ్దర్ నగోరి అరెస్ట్ తర్వాత సిమి నాయకత్వాన్ని చేపట్టాడతను.  బాబ్రీ మస్జీద్ కేసులో తీర్పు నిచ్చిన జడ్జ్ లను హత్య చెయ్యటానికి ప్రణాళికవేసాడు, పోలీసుల మీద కాల్పులు జరిపాడు.  

మాజీ సిబిఐ డైరెక్టర్ జోగీందర్ సింగ్ మాట్లాడుతూ, దేశంలో ప్రబలిపోతున్న ఉగ్రవాదాన్ని రూపుమాపటం కోసం మోదీ ప్రభుత్వం కఠినమైన చర్యలను చేపట్టాలని, ఇంతకు ప్రభుత్వంలాగా వోటు బ్యాంక్ పాలసీని చేపడితే దేశంలో ప్రజలందరికీ ఇబ్బందులు తప్పవని అన్నారు.  అందువలన, మోదీ చాలా జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా కఠినతరమైన చట్టాలను తీసుకునిరావాలని, ఉగ్రవాదులను ఉక్కు పాదంతో అణచివేయాలని జోగీందర్ సింగ్ అన్నారు.  

మొత్తానికి మోదీకి ఉగ్రవాదులనుండి ప్రమాదం పొంచివుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles