Kcr powerful comment on modi and chandrababu

kcr, trs party, kcr election camp, bjp, narendra modi, tdp, chandrababu naidu, trs vs bjp, kcr fire on modi, pawan kalyan, election 2014.

kcr powerful comment on modi and chandrababu

ఈ ముగ్గురు కలిస్తే మీ జీవితాలో జీరోలే? కేసిఆర్

Posted: 04/24/2014 09:00 PM IST
Kcr powerful comment on modi and chandrababu

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఈరోజు విశ్వరూపం చూపించారు.   బిజేపి, టిడిపి పార్టీల నాయకులను ఉతికారేశారు.  ‘తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ నగరానికి వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతాడా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘అటొక ఆంధ్రోన్ని ఇటొక ఆంధ్రోన్ని పెట్టుకుని మోడీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటానికి నరేంద్రమోడీకి ఎంత దమ్ము’ అని మండిపడ్డారు. ‘ఆంధ్రా నేత పిల్లిగడ్డం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును మోడీ చదివాడు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోడీ అన్నాడు. 

తెలంగాణను ఇస్తే భారత ఏడ్చిందని అన్నాడు. ఏ తల్లిని చంపారు? ఏ పిల్లను బతికించారు?’ అని కేసీఆర్ నిలదీశారు. ‘మోడీ సన్నాసీ తెలంగాణను ఇస్తే భారతమాత ఏడవలేదు నవ్వింది. తెలంగాణ తల్లికి విముక్తి కలిగిందని సంతోషించింది’ అని పేర్కొన్నారు. 1+1+1=3 కాదు, 111 అని మోడీ అంటున్నాడు... కానీ నేను చెబుతున్నా... ఈ ముగ్గురు కలిస్తే మీ బతుకులు మూడు జీరోలేనని(000) ఎద్దేవా చేశారు.

ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles