Self defending atms soon

Self defending ATMs soon, breaking of ATMs, ATM breakers, Protection to ATMs from breakers, self protection mechanism to ATMs

Self defending ATMs soon, breaking of ATMs

ఎటిఎమ్ లకు ఆత్మ రక్షణ వెసులుబాటు

Posted: 04/15/2014 02:22 PM IST
Self defending atms soon

ఎటిఎమ్ లమీద వరుసగా దాడులు జరిగి బ్యాంక్ లకు నష్టం జరుగుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దాడులను అరికట్టటం కోసం ఆత్మరక్షణ ఏర్పాట్లు చెయ్యటం జరుగుతోంది. 

జూరిచ్ లోని ఇటిహెచ్ యూనివర్శిటీలో కెమిస్ట్రీ, అప్లైడ్ బయో సైన్సెస్ విభాగంలోని పరిశోధనా బృందం ఎటిఎమ్ ల భద్రత కోసం ప్లాస్టిక్ పొరలతో ఎటిఎమ్ మెషిన్ల మీద రక్షణ పొరను ఏర్పాటు చెయ్యటంలో కృతకృత్యులయ్యారు.  ఆ పొరకి నష్టం కలిగిన సందర్భంలో అందులోంచి వేడి నురగ బయటకు వచ్చి దాడి చేసినవారి ముఖానికి తాకుతుంది. 

దీని మెకానిజం చాలా సులభంగా చెయ్యగలిగిందే.  ప్లాస్టిక్ పొరల మధ్య తేనె పట్టులాంటి ఖాళీలలో కొన్నిటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్, కొన్నిటిలో మాంగనీస్ డయాక్సైడ్ నింపుతారు.  పై పొరకి నష్టం సంభవించినప్పుడు అంటే ఎవరైనా ఎటిఎమ్ ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే, ఆ రెండూ కలిసి, నీటి ఆవిరి నురగతోపాటు 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో బయటకు వెలువడుతుంది. 

ఈ  మెకానిజం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, చెడిపోయే అవకాశం లేదని చెప్తున్నారు పరిశోధకులు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles