Bjp led nda will bag 275 seats ndtv survey reveals

BJP led NDA will bag 275 seats NDTV survey reveals, ok sabha elections 2014 survey, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014 photos, search Lok Sabha elections 2014,l

BJP led NDA will bag 275 seats NDTV survey reveals

భాజపా నేతృత్వంలో ఎన్డియే కి అధికారం- తాజా సర్వే

Posted: 04/15/2014 12:45 PM IST
Bjp led nda will bag 275 seats ndtv survey reveals

భాజపా నేతృత్వంలో నడిచే ఎన్డియే కూటమికి 2014 ఎన్నికలలో 275 సీట్లు లభించే అవకాశం ఉందని ఎన్డిటివి కోసం హంసా రిసెర్చ్ చేసిన సర్వేలో తేలింది. 

భాజపా ప్రత్యర్థ పార్టీ కాంగ్రెస్ కి 92 సీట్ల వరకు, కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేసే యుపిఏ కి 111 సీట్లు మాత్రమే రావొచ్చని కూడా సర్వే వెల్లడిస్తోంది.  అయితే 2 శాతం వరకు అటు ఇటుగా ఈ సర్వే ఫలితాలను తీసుకోవచ్చని ఎన్డీటివి చెప్తోంది.  అధికారంలోకి రావటానికి ఎన్డియే చేరుకోవలసిన మ్యాజిక్ ఫిగర్ 272. 

ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపు ఓటమిలు జాతీయ స్థాయిలో అధికారానికి దోహదం చేస్తుంది కాబట్టి యుపిలో 51 సీట్లను భాజపా కైవసం చేసుకుంటుందని అంచనా వెయ్యటం జరిగింది. 

ఈ సర్వే నివేదికలు కాంగ్రెస్ పార్టీని మరింత నిరాశలోకి నెట్టివేస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే నివేదికల ప్రకారం, అస్సాం, కర్నాటక, పంజాబ్, కేరళలో విజయం వాళ్ళకి 120 నుంచి 140 సీట్ల వరకు సంపాదించిపెడుతుంది.  కానీ హంస రిసెర్చ్ సర్వే అంత మాత్రం కూడా సాధ్యం కాదని తేల్చింది.  అంటే బలమైన ప్రధాన ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోతుందని సర్వే రిపోర్ట్ లు చెప్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles