2014 ఎన్నికల ప్రచారంలో రాజస్తాన్ లో సోమవారం మొదటి ప్రసంగం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దేశంలో ఏదో పరివర్తన తీసుకొస్తానని చెప్తున్న భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఏం చేస్తారు, ఎలా చేస్తారు ఆయన దగ్గరేమైనా మంత్రదండముందా అని ప్రశ్నించారు.
భారతదేశాన్ని స్వర్గతుల్యం చేస్తానని చెప్తున్న మోదీ దగ్గర అటువంటి మంత్రదండమేముందో అర్థం కావటం లేదన్నారు సోనియా గాంధీ, కాంగ్రెస్ అభ్యర్థి సిపి జోషీకి మద్దతుగా జైపూర్ లోని పావోటా లో ప్రసంగిస్తూ.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా పనిచేస్తుందని, మరో పార్టీని చూస్తే అది కుల మత విద్వేషాలను రేపి రాజకీయ లబ్ధి పొందుతుందని, ఇటువంటి సమయంలో ఎవరికి వోటెయ్యాలన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని సోనియా గాంధీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని సాధించలేదని కొందరు అంటున్నారు కానీ గత 66 సంవత్సరాలుగా అభివృద్ధికి బాటలు వేసిందే కాంగ్రెస్ పార్టీయని, మనుషుల ఆయు ప్రమాణంలో కానీ, తిండిగింజల ఉత్పత్తిలో కాని, విద్యుదుత్పత్తిలోకాని, రోడ్ల నిర్మాణంలోకాని, మహిళా నిరక్షరాస్యతలో కాని ఎంతో అభివృద్ధిని సాధించిందని, దేశంలో 94 కోట్లమంది చేతికి సెల్ ఫోన్లు రావటానికి కారణం కూడా కాంగ్రెస్ కృషేనని అన్న సోనియా గాంధీ, భాజపా మమ్మల్ని విమర్శించటమే పనిగా పెట్టుకుందని అన్నారు.
కిక్కిరిసిన జనంతో సాగిన సభలో కాంగ్రెస్ అభ్యర్థి సిపి జోషి, రాజస్తాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్ ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more