Amit shah azam khan public speeches prohibited by ec

Amit shah Azam Khan public speeches prohibited by EC, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Amit shah Azam Khan public speeches prohibited by EC

ఆ ఇద్దరి బహిరంగ సభలనూ నిషేధించాం- ఇసి

Posted: 04/12/2014 08:42 AM IST
Amit shah azam khan public speeches prohibited by ec

భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా, సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆజమ్ ఖాన్ ల బహిరంగ సభలు ఎక్కడున్నా వాటిని నిషేధిస్తున్నామని ఎన్నికల కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిద్దరి మీద రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చెయ్యటంలో విఫలమైనందువలన వాళ్ళిద్దరి మీదా క్రిమినల్ కేసులు నమోదు చెయ్యవలసిందిగా ఎన్నికల కమిషన్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరింది.  వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడైతే ప్రసంగాలివ్వటానికి ప్రణాళిక వేసుకున్నారో వాటన్నిటిచోటా వాటిని నిలిపివేయవలసిందిగా ఆదేశించింది.  

ఎన్నికలు స్వచ్ఛందంగా జరగటానికి భారత రాజ్యాంగం ఆర్టికిల్ 324 ఇచ్చిన విస్తృత అధికారాలను ఉపయోగించుకుంటూ ఎన్నికల కమిషన్ ఈ సారి ఎన్నికలలో మొట్టమొదటిసారిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినవారిమీద విరుచుకుపడింది.  

నరేంద్ర మోదీకి సన్నిహితుడైన అమిత్ షా పోయిన వారం ముజప్ఫర్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మనమింతవరకూ అణగదొక్కబడివున్నాం.  మనమిక లేచి పోరాడి ప్రతీకారం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది అని అక్కడి హిందువులను రెచ్చగొట్టారు.  ప్రముఖంగా టివి ఛానెల్స్ లో వచ్చిన ఆయన ప్రసంగంలో, కర్రలు కత్తులు తుపాకులతో పోరాడే రోజులు పోయాయి.  ప్రతీకారం తీర్చుకోవాలంటే బటన్ నొక్కటమే ఇక అన్నారు.  

అలాగే ఆజమ్ ఖాన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్ధంలో ఏ హిందువూ చనిపోలేదని, యుద్ధంలో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ముస్లింలేనని అన్నారు.  

వీళ్ళిద్దరికీ ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసిచ్చినా వాళ్ళ దగ్గర్నుంచి ఇంతవరకూ వివరణ రాలేదు.  ఆ ప్రసంగాలలోని అంశాల గురించి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వాటిని మత ప్రాదిపదిక మీద విద్వేషాలు రగిలించి ప్రజల మధ్య చిచ్చు పెట్టేట్టుగా ఉన్నాయని అన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల మీద ఎటువంటి చర్య తీసుకోకపోవటాన్ని తప్పుపడుతూ, ఈ రోజు సాయంత్రం 5.00 గంటల వరకు చర్య తీసుకున్నట్లుగా కంప్లయన్స్ రిపోర్ట్ ని సమర్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles