Vajpaye photo in congress official website

Vajpaye photo in Congress official website, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Vajpaye photo in Congress official website

కాంగ్రెస్ అఫిషియల్ వెబ్ సైట్లో వాజ్ పాయ్ ఫొటో

Posted: 04/11/2014 11:42 AM IST
Vajpaye photo in congress official website

కాంగ్రెస్ పార్టీ తన అఫిషియల్ వెబ్ సైట్ లో భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ ఫొటోని పెట్టటం కలకలాన్ని సృష్టిస్తోంది.  వాజ్ పాయ్ ఫొటోని పెట్టటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తన అఫిషియల్ వెబ్ సైట్ లో వాజ్ పాయ్ గుణాలను కూడా కీర్తిస్తోంది. 

అందుకు కారణం వాజ్ పాయ్ ప్రస్తుత భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మీద ఆ సమయంలో వ్యాఖ్యానించటం.  మోదీ రాజధర్మాన్ని పాటించలేదని అందువలన ముఖ్యమంత్రిగా అనర్హుడని వాజ్ పాయ్ చెప్పారని, ముఖ్యమంత్రిగానే పనికిరానివాడు ప్రధానమంత్రిగా పనిచెయ్యటానికి ఏవిధంగా యోగ్యులని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. 

కాంగ్రెస్ వెబ్ సైట్ లో వాజ్ పాయ్ ఫోటో కింద ఈ వివరణను కూడా ఇచ్చింది-

భాజపా సంస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్ పాయ్ తో సరితూగగల నాయుకుడెవరూ లేరని, 2002 లో గుజరాత్ లో హింసాకాండను నిలువరించలేక విఫలమైన ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ మోదీ వలన పార్టీకే చెడ్డపేరు వస్తుందని, ఆయన మీద చర్య తీసుకోనట్లయితే తాను రాజీనామా చేస్తానని కూడా అన్నారు.  వాజ్ పాయ్ ప్రధానంగా బాధపడింది మోదీ గుజరాత్ ప్రజానీకానికి రక్షణ కల్పించటంలో విఫలమై తన రాజధర్మాన్ని పాటించలేనందుకు.  ప్రజలందరినీ సమానంగా చూడాలని, కులమతజాతి వివక్షతలకు తావివ్వవద్దని ఉద్బోధించారు.  మేము కూడా మా పార్టీ తరఫునుంచి అనేక మార్లు బాధితులకు పరిహారం చెల్లించమని అర్థించాం.  మతవిద్వేషంతో తన రాష్ట్ర ప్రజలకు న్యాయం చెయ్యలేని మోదీ ప్రధానమంత్రిగా ఏం పనిచేస్తారని ఆశించగలం. 

మోదీ మీద వ్యామోహంతో భాజపాలో సమర్ధవంతుడైన నాయకుడైన వాజ్ పాయ్ పట్ల పార్టీ అన్యాయంగా ప్రవర్తిస్తోందనటానికి ఉదాహరణలు, వాజ్ పాయ్ కరుణ శుక్లాని పార్టీ వదిలి వెళ్ళేట్టుగా చెయ్యటం.  ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  అలాగే వాజ్ పాయ్ తో పాటుగా సన్నిహితంగా పనిచేసిన జస్వంత్ సింగ్ ని పార్టీ నుంచి బహిష్కరించారు.  అంతే కాకుండా, 1998 లో వాజ్ పాయ్ కి వ్యతిరేకంగా పనిచేసిన డా.సుబ్రహ్మణ్య స్వామికి భాజపాలో ముఖ్యమైన స్థానమిచ్చారు. 

వాజ్ పాయ్ ఫొటోను కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ నుంచి తీసివెయ్యవలసిందిగా భాజపా కోరుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No confidence motion notice accepted by ap speaker
Third day budget session in ap assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles