Third day budget session in ap assembly

ap assembly, budget session, speaker, adjournments due to commotion, opposition parties, congress party instructions

third day budget session in ap assembly

assembly-third-day.png

Posted: 03/15/2013 10:05 AM IST
Third day budget session in ap assembly

శాసన సభలో దృశ్యం మళ్ళీ మామూలే. ఈ రోజు విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించటంతో ప్రతిపక్షాలన్నీ ఆందోళనకు దిగాయి. సభాపతి చుట్టుముట్టి గందరగోళ పరిస్థితిని తేవటంటో సభాపతి సభను 10 గంటల వరకు వాయిదావేసారు.

ప్రతిపక్షాలందించి వాయిదా తీర్మానాలు ఇవి-

తెలుగు దేశం పార్టీ- విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి

భారతీయ జనతా పార్టీ- విద్యుత్ కోత

తెలంగాణా రాష్ట్ర సమితి- ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం మీద తీర్మానం

వైయస్ఆర్ కాంగ్రెస్- విద్యుత్ కోత వలన జరుగుతున్న పంట నష్టం

మజ్లిస్ పార్టీ- రాష్ట్రంలో ఏర్పడ్డ తాగునీటి కొరత

సిపిఐ- ఫ్లోరైడ్ సమస్య, నక్కలగండి రిజర్వయిర్

సిపిఎమ్- పెంచిన విద్యుత్ ఛార్జీల ఉపసంహరణ

తెలంగాణా నగారా సమితి- తెలంగాణా పోరులో యువత బలిదానం

జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. అందులో సారాంశం విపక్షాలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలి, ఈ రెండు మూడు రోజులూ అందరూ శాసన సభలో అందుబాటులో ఉండాలి.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles