Newly wed ram and sita blessed by pandits

Newly wed Ram and Sita blessed by Pandits, Srirama Navami, Bhadrachalam Rama Navami, Sadasyam in marriage ritual

Newly wed Ram and Sita blessed by Pandits

దేవదేవుడికి పండితుల ఆశీర్వచనం

Posted: 04/11/2014 10:44 AM IST
Newly wed ram and sita blessed by pandits

దేవుడి దగ్గరికెళ్ళి నాకిది కావాలి అని అడిగేవాళ్ళే ఉంటారు కానీ ఆయనకి ఏమైనా ఇద్దామనుకునేవారు అల్పసంఖ్యాకులే.  సీతారాముల వివాహానికి వారిద్దరికీ శుభాకాంక్షలెవరూ చెప్పరు. 

కానీ శ్రీసీతారాముల కళ్యాణం మాత్రం మిగతా దేవుళ్ళ వివాహ వేడుకకు భిన్నంగా జరుగుతుంది.  అందుకు కారణం శ్రీరాముడు దేవదేవుడే అయినా మానవ జన్మనెత్తి మానవులలాగానే కష్టాలను అనుభవించటం జరిగింది.  పితృవియోగం, భార్యా వియోగం, రాజ్యాధికారాన్ని పొగొట్టుకోవటం, వనవాసం, రాక్షసులతో పోరు, చివరకు ఉత్తర రామాయణంలో తన సంతానంతో కూడా పోరాటానికి దిగవలసివస్తుంది. 

అందువలన శ్రీరామనవమినాడు జరిగే ఆయన వివాహాన్ని లోకకళ్యాణంగా జనులందరి కళ్యాణంగా భావిస్తారు.  ఆ కళ్యాణ మూర్తులను దర్శించి పులకించిపోతారు.  అందుకే రాముని కళ్యాణ వేడుకలో ప్రతి అంశాన్నీ కచ్చితంగా పాటించే ఆనవాయితీలో మూడవరోజున జరిగే సదస్యంలో వేదపండితులు సీతారాములకు ఆశీర్వచనాన్ని కూడా అందిస్తారు.  చతుర్వేద పండితులు ద్రవిడ దివ్య ప్రబంధాన్ని పారాయణం చెయ్యటానికి దేశం నలుమూలలనుంచీ విచ్చేసి దేవదేవుడికి మహదాశీర్వచనాన్ని నిర్వహించారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles