Kejriwal repents for resigning from cm post

Kejriwal repents for resigning from CM post, Aam Admi Party Arvind Kejriwal, Kejriwal resigned after 49 days of power, Arvind Kejriwal resigned from CM.

Kejriwal repents for resigning from CM post

రాజీనామా చేసి తప్పు చేసా- ఒప్పుకున్న కేజ్రీవాల్!

Posted: 04/11/2014 02:27 PM IST
Kejriwal repents for resigning from cm post

ఢిల్లీ శాసనసభలో జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టలేనందుకు రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ అది తన తొందరపాటేనని ఒప్పుకున్నారు. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటం, సిద్ధాంతపరంగా దాన్ని వదిలెయ్యటం తప్పని కాదు కానీ ఆ విధంగా సిద్ధాంతం కోసం పదవిని వదిలేసిన తనను ప్రజలు తమంతట తామే అర్థం చేసుకుంటారనుకున్నా అది నేను చేసిన తప్పు అన్నారు కేజ్రీవాల్ ఒక బిజినెస్ వార్తా పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. 

అక్కడ ప్రజలకీ తనకీ మధ్య సమాచారలోపం సంభవించిందని, ఆ లోపాన్ని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమదైన శైలిలో పూరించారని, తాను బాధ్యతలనుంచి పారిపోయానని చెప్పుకున్నారని అన్నారు కేజ్రీవాల్.  నేను అదే రోజు ఆ బిల్లును ఆ రెండు పార్టీలు అడ్డుకున్న రోజునే రాజీనామా చేసుండాల్సింది కాదు.  కొన్ని రోజులు ఆగవలసింది.  వెంటనే అధికారాన్ని వదిలి రావటంతో ప్రజలకు నేను ఎందుకు అలా చేసానన్నది అర్థం కాలేదు.  దాన్ని వ్యతిరేక దృష్టితో చూసారు.  దానితో సమాచారలోపం ఏర్పడింది.  భవిష్యత్తులో మరోసారి అలాంటి తప్పు చెయ్యగూడదు. అన్నారు కేజ్రీవాల్.

కేజ్రీవాల్ అలా 49 రోజుల అధికారాన్ని వదిలిపెట్టటం వలనే ఆయనను నరేంద్ర మోదీ ఎకె 49 అనగలిగారు.  అలాంటి అవకాశం ఆయనకి వేరుగా అర్థం చేసుకోవటానికి ప్రజలకు ఇచ్చినందుకు అరవింద్ కేజ్రీవాల్ పశ్చాత్తాపపడుతున్నట్లుగా కనిపించారు.

కేజ్రీవాల్ మీద దాడిచేసినవారితో మాట్లాడిన తర్వాత వాళ్ళ వలన ప్రజాభిప్రాయం సూచనప్రాయంగా తెలిసి, ఆ తర్వాత ఈ విషయం ఆయనకు అవగాహనలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది! 

(ఫొటోలో కేజ్రీవాల్ ఢిల్లీ తిలక్ మార్గ్ లో తన వోటు హక్కుని వినియోగించుకుని వస్తూ)

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles