Bhadrachalam srirama navami

Bhadrachalam Srirama Navami performed with reverence, Governor ESL Narasimhan, TTD Chairman Kanumuri Bapiraju

Bhadrachalam Srirama Navami performed with reverence

సీతారాముల కళ్యాణం కడు వైభవం

Posted: 04/08/2014 12:36 PM IST
Bhadrachalam srirama navami

భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.  జగదానంద కారకుడైన జానకీ ప్రాణ నాయకుడు తన అర్ధాంగితో కలిసి నూతన వధూవరులుగా నయనానందకరంగా భక్తులకు దర్శనమిచ్చారు.

సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మాంగల్య ధారణ జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి ఆనవాయితీగా స్వామివారికి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను, ముఖ్యమంత్రి లేనందున ఈసారి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సమర్పించారు.  తిరుమల తిరుపతి దేవస్థానం తరఫునుంచి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు స్వామివారికి ఈ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. 

భద్రాచలంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు.  చిన్నపాటి తోపులాట, స్వల్పమైన లాఠీ చార్జ్ ని మినహాయించి భద్రాచలంలో కళ్యాణోత్సవం సాఫీగా సాగిపోయింది. 

రాష్ట్రం మొత్తం ఈ రోజు శ్రీరామ నవమిని అత్యంత వైభవంగా చేసారు.  సాంప్రదాయం ప్రకారం పందిళ్లు వేసి కళ్యాణం చేసి  తీర్థ ప్రసాదాలతోపాటు శీతలం వితరణ చేసారు.  అన్నదానాలు విరివిగా సాగాయి.  ఎన్నికల కోలాహలం ఒకపక్క ఉన్నా, సాంప్రదాయ బద్ధంగా భక్తులు లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణాన్ని ఆలయాల్లోనే కాకుండా పలు ప్రాంతాల్లో నిర్వహించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles